హైదరాబాద్ : అక్రమాస్తుల కేసులో జైలుపాలైన హెచ్ఎండీఏ( HMDA) మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ (Sivabalakrishna) రిమాండ్‌ను నాంపల్లి కోర్టు మరో 14 రోజులు పొడిగించింది. రిమాండ్ పొడిగించడంతో శివబాలకృష్ణను పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. కాగా, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టు అయిన శివ బాలకృష్ణ ప్రస్తుతం చంచల్‌గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే.
శివ బాలకృష్ణ గతంలో మెట్రో రైల్ చీఫ్ జనరల్ మేనేజర్‌గా పని చేశారు. రెరా ఇంచార్జి కార్యదర్శిగా కూడా పని చేశారు. ఏసీబీ కేసుల నేపథ్యంలో శివబాలకృష్ణను హెచ్ఎండీఏ మెట్రో పాలిటన్ కమిషనర్ దాన కిశోర్ సస్పెండ్ చేశారు. అలాగే ఏసీబీ తెలంగాణ, ఏపీలో పలు చోట్ల సోదాలు చేపట్టారు. శివబాలకృష్ణ బంధువుల పేరిట 214 ఎకరరాల వ్యవసాయ భూములు రిజిస్టర్ అయినట్టు తేలిందని ఏసీబీ అధికారులు తెలిపారు.
జనగామ జిల్లాలో 102, యాదాద్రి భువనగిరి జిల్లాలో 66, నాగర్‌కర్నూల్ జిల్లాలో 38, సిద్దిపేటలో 7 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్టు వెల్లడించారు. శివబాలకృష్ణ అక్రమాల వెనుక హెచ్ఎమ్డీఏ, మెట్రోరైల్ అధికారుల పాత్రపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.