Numaish | అబిడ్స్, ఫిబ్రవరి 11: నాంపల్లిలోని ఎగ్జిబిషన్ మైదానంలో కొనసాగుతున్న అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనను రెండు రోజులు పొడిగించేందుకు పోలీస్ శాఖ అనుమతించింది. ఎగ్జిబిషన్ సొసై టీ ఉపాధ్యక్షులు కే నిరంజన్, కార్యదర్శి బీ సురేందర్ రెడ్డి, సభ్యులు సుఖేశ్ రెడ్డి, ధీరజ్ జైస్వాల్‌లు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్‌ను ఆయన కార్యాలయంలో కలిసి ఎగ్జిబిషన్‌ను ఈ నెల 17 వ తేదీ వరకు పొడిగించేందుకు అనుమ తి ఇవ్వాలని వినతి పత్రం సమర్పించా రు.
వినతిపత్రం స్వీకరించిన నగర పోలీ స్ కమిషనర్ సీవీ ఆనంద్ రెండు రోజు లు పొడిగింపునకు అనుమతి ఇచ్చేందు కు సానుకూలంగా స్పందించినట్లు ఎగ్జిబిషన్ సొసైటీ కార్యదర్శి బీ సురేందర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా సెక్రటరీ సురేందర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రతి సం వత్సరం జనవరి ఒకటో తేదీ నుంచి ప్రా రంభమయ్యే అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన ఈ సంవత్సరం మూడో తేదీ నుంచి ప్రారంభించడం జరిగిందని, దీం తో స్టాల్ యజమానులు ఎగ్జిబిషన్ ను పొడిగించాలని విన్నవించారని తెలిపా రు. వారి విజ్ఞప్తి మేరకు పోలీస్ శాఖ అనుమతి కోసం వినతిపత్రం సమర్పించామని కమిషనర్ సానుకూలంగా స్పం దించినట్లు ఆయన తెలిపారు.