సిటీబ్యూరో, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): కొత్త బ్రాండ్లను సృష్టించాలన్నా.. వినూత్నమైన కలెక్షన్స్ అందించాలన్నా.. హైదరాబాద్ నిలయంగానే సాధ్యం. దేశంలోని ఇతర రాష్ర్టాల ప్రముఖ డిజైనర్లు సైతం హైదరాబాదీల టేస్ట్‌కు అనుగుణంగానే వ్యాపారం సాగిస్తున్నారు. ఇక్కడ బిజినెస్ పొటెన్సియల్ ఎక్కువగా ఉండటమే అందుకు కారణం. నగరవాసులు ఫ్యాషన్ కోసం ఎంతైనా వెచ్చించడానికి ఇష్టపడుతారు. ట్రెండ్స్, హై లైఫ్, లైఫ్‌ైస్టెల్, ఆకృతి, పెటల్స్, హస్తశిల్పి, పోచంపల్లి, ఇలా విభిన్నమైన ఎగ్జిబిషన్లు తమకంటూ ప్రత్యేకమైన బ్రాండ్లను సృష్టించుకుంటున్నాయి. ప్రజల జీవన శైలికి అనుగుణంగా సరిపడే వస్తువులను ఎగ్జిబిషన్లలో ఉంచుతున్నారు. మరోవైపు ఆర్ట్ ఎగ్జిబిషన్లు కూడా జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే కళాకృతి ఆర్ట్ గ్యాలరీలో ది అదర్ సైడ్ ఆర్ట్ ఎగ్జిబిషన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. నగరంలో ప్రతి రోజు ఏదో ఒక ప్రాంతంలో ఎగ్జిబిషన్ల సందడి కొనసాగుతుండటం విశేషం.
హైదరాబాద్‌లో కొన్ని హోటల్స్ ఎగ్జిబిషన్ నిర్వహణ కోసం హాల్స్‌ను కేటాయిస్తున్నాయి. తాజ్ దక్కన్, తాజ్ బంజారా, జీవీకే తదితర వాటిలో ప్రత్యేకంగా హాల్స్‌ను వదిలేస్తున్నారు. ఆర్ట్స్ ఎగ్జిబిషన్ కోసం మధురానగర్‌లో ఇస్కాన్ ఈశ్వర్‌సాయి కళానికేతన్ అపార్ట్మెంట్లో ప్లాట్‌ను పూర్తిగా కేటాయించారు. హై లైఫ్‌ైస్టెల్‌కు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, హైటెక్‌సిటీ, సామాన్యులు కోరుకునే ఫ్యాన్సీ వస్ర్తాలకు శ్రీనగర్‌కాలనీ, నాంపల్లి, హిమాయత్‌నగర్, మాదాపూర్ తదితర ప్రాంతాలు వేదికలవుతున్నాయి. జూలై నుంచి అక్టోబర్ వరకు పండుగల సమయంలోనే కాకుండా సాధారణ రోజుల్లో సైతం ఎగ్జిబిషన్ల సందడి జోరుగా ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నా
నగరంలో ఎగ్జిబిషన్లను నిర్వహించే వారిలో మహిళల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఫ్యాషన్‌పై వారికి ఎక్కువగా అవగాహన ఉండటం కూడా వారికి కలిసివస్తుంది. సామాజిక కోణంలో కూడా కొంతమంది ఎగ్జిబిటర్లు ఎగ్జిబిషన్లను నిర్వహిస్తున్నారు. బిజినెస్ వస్తే అందులో కొంత చారిటీలకు ఇవ్వడం, పేద విద్యార్థులను చదివించడానికి కేటాయించడం తదితర కారణాలతో కూడా ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఎగ్జిబిషన్లలో వేల రూపాయలు వెచ్చించి స్టాల్స్ పెట్టుకుంటున్నారు. వారు క్రియేట్ చేసిన బ్రాండ్లను ఎగ్జిబిషన్లలో ప్రదర్శనకు పెడుతున్నారు. హైదరాబాద్‌లో బిజినెస్ జోరుగా సాగుతుండటంతో ఎగ్జిబిటర్లు ఎగ్జిబిషన్లను నిర్వహించడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. గతంలో చాలా రాష్ర్టాల్లో ఎగ్జిబిషన్లు నిర్వహించిన వారు సైతం హైదరాబద్‌లోనే ఎక్కువ బిజినెస్ అవుతుందని చెప్పారు.
ఎగ్జిబిషన్లతో ఎగ్జిబిటర్లు అందరూ ఒకే వేదిక వద్ద కలుసుకునే అవకాశం ఉంటుంది. కస్టమర్లు ఏం కోరుకుంటున్నారో తెలుసుకునే వీలుంది. ఔత్సాహిక డిజైనర్లకు ప్రోత్సాహకంగా ఎగ్జిబిషన్లు ఉపయోగపడుతాయి. దేశంలో ప్రముఖ డిజైనర్లు ముంబాయి, ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వస్తుంటారు. ఇక్కడ ఎగ్జిబిషన్లలో పాల్గొని నగర ప్రజల ఆసక్తులను తెలుసుకుంటారు. అందుకు అనుగుణంగా స్టాల్స్ ఏర్పాటు చేస్తారు. సాధారణంగా ఇక్కడ వ్యాపారం చేయడానికి ఆసక్తి ఉన్న వారు మొదటగా ఎగ్జిబిషన్లలో వారి ప్రొడక్ట్స్ ప్రదర్శనకు పెట్టి బిజినెస్ బాగా జరిగితే అనంతరం షాపులు ఏర్పాటు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. షాప్స్‌లలో నెల రోజుల్లో జరిగే అమ్మకాలు.. హైదరాబాద్‌లో రెండు మూడు రోజులు కొనసాగే ఎగ్జిబిషన్లలోనే ఎక్కువగా ఉంటాయని ఎగ్జిబిటర్ ప్రణీత వివరించారు.
ఎగ్జిబిషన్లలో క్రియేటివిటీకి పదును పెట్టే అవకాశం ఉంది. ప్రముఖ డిజైనర్లకు కస్టమర్లు కోరుకునే కొత్త తరహా ఉత్పత్తులను డిజైన్ చేయడం, జ్యువెల్లరీ, టాయ్స్, వాచీలు ఇలా ప్రతి ప్రాడక్ట్‌లో కొంగొత్త డిజైన్లను రూపొందించడానికి కూడా ఎగ్జిబిషన్లు వేదికలవుతాయి. విభిన్న రకాల కస్టమర్లు ఒకే వేదిక వద్దకు రావడంతో ఎలాంటి ఫ్యాషనేబుల్ ట్రెండ్ నడుస్తున్నది. ఎలాంటి వస్తువులను కస్టమర్లు ఇష్టపడుతున్నారు? వారు ఏం కోరుకుంటున్నారో సులభంగా అర్థం అవుతుందని నగరానికి చెందిన డిజైనర్ మౌన గుమ్మడి తెలిపారు.
నగరంలో షాపు ఏర్పాటు చేసుకుని తమ ఉత్పత్తుల అమ్మకాలు సాగించాలంటే చిన్న ఉత్పత్తిదారుల వల్ల సాధ్యం కాదు. షాపు ఏర్పాటు చేయాలంటే వేలల్లో అద్దె చెల్లించాలి. రిస్క్ చేసి షాపు పెట్టినా.. ఆ వస్తువుల అమ్మకాలు జోరుగా సాగుతాయో లేదో తెలియని పరిస్థితి. తమ ప్రాడక్ట్స్ కొనుగోలు చేసే కస్టమర్లను గుర్తించడం కూడా కష్టమే. వీటన్నింటిని ఎదుర్కోలేక చాలా మంది తమ ఉత్పత్తులను తక్కువ ధరలకే ఇతర సంస్థలకు విక్రయిస్తున్నారు. అలాంటి వారికి ఎగ్జిబిషన్లు ఎంతగానో తోడ్పడుతున్నాయి.
ఎగ్జిబిషన్ల ప్రాధాన్యత చాలా ఉంది. ఇక్కడి ప్రజలకు కొనుగోలు శక్తి ఎక్కువ. ఎగ్జిబిషన్ అనగానే మొదటగా నోటి ప్రచారం జోరుగా ఉంటుంది. విభిన్న రకాల డిజైనర్లకు కూడా ఎగ్జిబిషన్ ఓ వేదిక అవుతున్నది. ఇక్కడ జరిగే ఎగ్జిబిషన్లను కొంతమంది స్టడీ చేస్తారు. డ్రెస్, జువెల్లరీ కల్చర్ ఎలా ఉందో తెలుసుకుంటున్నారు. సేలింగ్ ఉందా లేదా చెక్ చేస్తున్నారు. అనంతరం ఔట్లెట్ ఓపెన్ చేయాలని నిర్ణయించుకుంటున్నారు. ఢిల్లీ, ముంబయికి చెందిన కొంతమంది డిజైనర్లు ఇక్కడ సెటిల్ అయ్యారు. – ఎ. వినీత సునీల్‌కుమార్, ప్రెసిడెంట్, ఇకెబనా ఇంటర్నేషనల్, హైదరాబాద్ చాప్టర్