జూబ్లీహిల్స్, ఫిబ్రవరి 23 : అలంకరణ నగరంలో 40 సంవత్సరాల అనుభవం గల సంస్థ సీబీజే వెడ్డింగ్ జ్యువెల్లరీ ప్రత్యేకతను చాటుకుంటోంది. అల్ట్రా లైట్ వెయిట్ బంగారు ఆభరణాల తయారీలో ప్రసిద్ధి పొందిన ఈ సంస్థ.. దేశంలోని బెంగళూరు, కోల్కత్తా, చెన్నై, ముంబైలో వర్క్‌షాప్‌లతో విభిన్నమైన డిజైన్లు కలిగిన సంస్థగా పేరొందింది. నాణ్యత, నమ్మకం, అతి తక్కువ తరుగుతో.. బంగారు ఆభరణాలు మార్కెట్ రేటు కంటే తక్కువ ధరతో కస్టమర్ల అభిమానాన్ని చూరగొంది. మాఘమాసంలో సీబీజేలో బంగారు ఆభరణాలది ప్రత్యేక స్థానం. పెండ్లీ ఆభరణాలలో వైవిధ్యమైన డిజైన్లు అందుబాటులో ఉంటాయి. పెండ్లీ కూతురుకు సరిపడా మిరుమిట్లు గొలిపే హారాలు, 100 శాతం హెచ్‌యూఐడీ బంగారు ఆభరణాలు లభ్యమవుతున్నాయి. కేపీహెచ్‌బీ వార్షికోత్సవ ఆఫర్‌గా బంగారు ఆభరణాల కొనుగోలుపై ప్రతి గ్రాముకు రూ.300 భారీ డిస్కౌంట్‌ను ప్రకటించారు.
సీజన్‌తో సంబంధం లేకుండా మగువల మనుసును దోచే ఆభరణాలు అనేకం. చెవిపోగుల నుంచి వడ్డాలం వరకు ప్రతీది ఓ ప్రత్యేకత. ట్రెండ్‌కు తగ్గ జ్యువెల్లరీని పరిచయం చేయడానికి నగరంలో సీబీజే సరికొత్తగా తమ బ్రాంచీలను విస్తృతం చేస్తున్నది. ముఖ ఆకారాన్ని ఆధారం చేసుకుని.. వయస్సును దృష్టిలో ఉంచుకుని.. వర్కింగ్‌ను బట్టీ.. డ్రెస్సు ఆధారంగా చేసుకుని.. ఇలా విభిన్న రకాలుగా జ్యువెల్లరీని మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే జ్యువెల్లరీ ట్రెండ్‌ను మగువలు ఫాలో అవుతున్నారు.
ప్రస్తుతం బోల్డ్, క్లాసిక్ రంగుల మిశ్రమంతో రూపొందించిన ఆభరణాలు, మీనాకారి విడివిడిగా రాళ్లతో తయారు చేసిన ఆభరణాల ట్రెండ్ నడుస్తోంది. వీటితో పాటు డైమండ్, రూబీ లాంటి రంగురాళ్లతో ఆభరణాలు తయారుచేసే క్లాసిక్ డైమండ్ జ్యువెల్లరీ కూడా బాగా ట్రెండ్‌లో ఉంది. రోజ్‌గోల్డ్ కూడా బాగా ప్రాచుర్యంలో ఉన్నదని జ్యువెల్లరీ నిర్వాహకులు రాధిక తెలిపారు. ఇండియన్ స్కిన్టోన్పై బాగా కనిపించేలా రోజ్ గోల్డ్ ఉంటుంది. ఇప్పుడు దీనిని మగువలు కొనడానికి అమిత ఆసక్తి చూపిస్తున్నారు. బోల్డ్ఎలిగెంట్ చోకర్, ఈయర్ రింగ్స్ ప్రత్యేకంగా ఆకర్షిస్తున్నాయి. ఎప్పుడైనా సరే ధరించడానికి అనువుగా ఉంటున్న వెరైటీలను ఎంపిక చేసుకుంటున్నారు. ఇక అన్ని రంగుల దుస్తులతో మ్యాచ్ అయ్యేలా ట్రాఫ్డ్, ప్రొటెక్టెడ్ జెమ్ స్టోన్ రత్నాలు పొదిగిన జ్యువెల్లరీ మార్కెట్లో అందుబాటులో ఉన్నదని నిర్వాహకులు చెప్పారు. ప్రస్తుతం ఫ్లూయిడ్ ఫార్మ్ దుస్తులు ఎక్కువగా ధరిస్తున్నారు. ఇలాంటి స్థితిలో మరింత అందగా కనిపించడానికి ఫ్లూయిడ్ ఫార్మ్ ఆభరణాలను ఆశ్రయిస్తున్నారు.
ఆభరణాలను డిజైన్ చేసే సమయంలో మూడు విషయాలను దృష్టిలో ఉంచుకుంటారు. ఒకటి సౌందర్యపు విలువ, రెండోది ధరించడంలో ఉన్న సౌకర్యం, మూడోది తక్కువ ధర.. ప్రస్తుతం మహిళలు తక్కువ ధరలో అందమైన డిజైన్లను వెతుకుతున్నారు. అవి అన్ని అవసరాలకు తగ్గట్టుగా ఉండాలని భావిస్తున్నారు. బ్రైడల్ జ్యువెల్లరీలో మహిళలు అన్ని రకాల ఆభరణాలు అంటే.. పాపిడి బిళ్ల, ముక్కుపోగు, జూకాలు, నెక్లెస్, మీడియం నెక్లెస్, చెవి జూకాలు, చెవి పోగులు, దండె కడియాలు, చేతి వంకీలు, వడ్డాణం, గజ్జెలు, మెట్టెలు.. వంటి వాటిపై మనసు పారేసుకుంటున్నారు. ఇక ఆఫీసుకు వెళ్లే మహిళల ఇష్టాలు.. సాధారణ మహిళలకు భిన్నంగా ఉంటాయి. వాళ్లు ఎక్కువగా చిన్న చెవి పోగులు, చిన్న జూకాలు, నార్మల్ క్లాసిక్ డ్రెస్‌తో పాటు ధరించడానికి ఇష్టపడుతారని ఐటీ ఉద్యోగి రవళి తెలిపారు. వేసుకునే డ్రెస్సులకు మ్యాచ్ అయ్యే ఆభరణాలను కొనుగోలు చేస్తామని చెప్పారు.
ఆభరణాలు ట్రెండ్ కంటే కూడా ఎక్కువగా ముఖాన్ని బట్టి ధరించాలి. ఓవెల్ ఫేస్‌లో ముఖం ఉన్న మహిళలకు మార్కిజ్ షేప్ చెవి ఆభరణాలు బాగుంటాయి. రౌండ్ షేప్ ఉన్న వాళ్లు జూకాలు ధరిస్తే బాగుంటాయి. స్కేర్ షేప్ ముఖం ఉన్న వాళ్లు జామితీయ ఆకారంలో ఉండే చెవి ఆభరణాలు ధరిస్తే బాగుంటుంది. టీనేజీ అమ్మాయిల్లో చిన్న చిన్న కలర్‌ఫుల్ డెలికేట్ ఆభరణాలు ధరించే ట్రెండ్ ఎక్కువగా నడుస్తోంది. ఇప్పుడు నోస్‌పిన్, నోస్ క్లిప్స్ బాగా ప్రచారంలో ఉన్నాయి. అవి వెస్టర్న్ డ్రెస్సులో బాగా నప్పుతాయి.
జ్యువెల్లరీ వినియోగం లేకుండా ఏ పెండ్లీ లేదు. ఎలాంటి వేడుకలైన మగువలు ఏదో ఒక జ్యువెల్లరీ ధరించాల్సిందే. అందులో ఇప్పుడు బాగా వినియోగంలో కలర్‌ఫుల్ జ్యువెల్లరీ ఉంది. మిడిల్ ఏజ్‌లో ట్రెడీషనల్, ఫైవ్ వర్క్ ఉన్న క్లాసిక్, ఫైన్గోల్డ్ ఆభరణాలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. వీటితో పాటు జూకాలు, చెవి పోగులు, జాలీవర్క్, డైమండ్ లుక్ ఎక్కువగా ట్రెండ్‌లో ఉన్నాయి. 50 ఏండ్లు దాటిన మహిళలకు సింగి లైన్ నెక్లెస్, కుందన్ నెక్లెస్, ఫ్యూర్ డైమండ్ లేదా గోల్డ్ కంకణం లాంటివి బాగా ప్రచారంలో ఉన్నాయి. సీబీజే షో రూమ్‌లలో విభిన్న రకాల జ్యువెల్లరీ అందుబాటులో ఉంది.