హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలోని ధూల్‌పేటలో(Dhulpet) ఎక్సైజ్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు(Excise police) కలిసి బుధవారం విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ధూల్‌పేటలోని దత్తాత్రేయనగర్, అసిఫ్‌నగర్, అప్పర్ ధూల్‌పేట్‌లో ప్రతి ఇంటిని పోలీసులు జల్లెడ పట్టారు. గంజాయి(Ganja) వినియోగం పెరగడంతో.. సోదాలు చేపట్టారు. ఈ క్రమంలో అనురాజ్ బాయ్(అనితాబాయ్), పప్పారామ్ ఇంట్లో దాచిపెట్టిన గంజాయిని వెలికి తీశారు. గంజాయిని తూకం వేయగా 1.679 కేజీలుగా తేలింది. ఈ గంజాయిని షేక్‌పేట్‌కు చెందిన సుభాష్‌సింగ్ వద్ద తీసుకొని వచ్చి ధూల్‌పేట్‌లో అమ్మకాలు జరుపుతున్నట్లు స్పెషల్ టాస్క్‌ఫోర్స్ సూపరిండెంట్ అంజిరెడ్డి తెలిపారు.
ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకొని రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మరో నిందితుడు సుభాష్‌సింగ్ పరారీలో ఉన్నాడని త్వరలో పట్టుకుంటామని ఆయన పేర్కొన్నారు. గంజాయిని పట్టుకున్న పోలీస్ సిబ్బందిని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్‌రెడ్డి అభినందించారు. గంజాయి అమ్మినా, సరఫరా చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.