సిటీబ్యూరో, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): డ్రగ్స్, గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను హైదరాబాద్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 2.50కిలోల గంజాయి, రెండు గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ , రూ. 5500 నగదుతో పాటు రెండు సెల్ఫోన్లు, రెండు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఎన్ఫోర్స్మెంట్ సీఐ చంద్రశేఖర్‌గౌడ్ కథనం ప్రకారం…బంజారాహిల్స్‌లోని తెలంగాణ ఎస్సీ స్టడీ సరిల్, కేబీఆర్ పార్ సమీపంలో గంజాయితో పాటు డ్రగ్స్ అమ్మకాలు జరుగుతున్నాయనే సమాచారం మేరకు హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ బృందం గురువారం ఉదయం దాడులు నిర్వహించింది.
ఈ దాడుల్లో గంజాయి, డ్రగ్స్ విక్రయాలకు పాల్పడుతున్న పి.వేమేశ్, కె.దేవిచరణ్, వై.హేమంత్‌లను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రెండున్నర కిలోల గంజాయి, రెండు గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ , రూ. 5500 నగదుతో పాటు రెండు సెల్ఫోన్లు, రెండు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం కేసును అమీర్‌పేట్ ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు. ఈ దాడుల్లో సీఐతో పాటు కానిస్టేబుళ్లు కిరణ్ , శ్రీకాంత్ , సాయి కుమార్ , ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
నిబంధనలకు విరుద్ధంగా ఇతర రాష్ర్టాల నుంచి నగరానికి తరలిస్తున్న 48మద్యం బాటిళ్లను ఎస్టీఎఫ్ పోలీసులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే…గోవా, ఢిల్లీ, హర్యానా ప్రాంతాల నుంచి నాన్ డ్యూటీ పెయిడ్ లికర్ సరఫరా అవుతుందనే సమాచారం మేరకు ఎస్టీఎఫ్ పోలీసులు పహడీషరీఫ్ వద్ద వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా అటుగా వస్తున్న కారును తనిఖీ చేయగా 48 నాన్ డ్యూటీపెయిడ్ మద్యం బాటిళ్లు బయటపడ్డాయి. ఎస్టీఎఫ్ సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై మంజు పాల్గొన్నారు.