Talasani Srinivas Yadav | అమీర్‌పేట, మార్చి 6 : శతాధిక వృద్ధురాలి మృతికి మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సంతాపం తెలిపారు. అమీర్‌పేటకు చెందిన వ్యాపారవేత్త, BRS పార్టీ నాయకులు కొత్తపల్లి మధుసూదన్ రావు మాతృమూర్తి శకుంతలా దేవి (100) గురువారం మరణించారు.
విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అమీర్‌పేట రిలయన్స్ వీధిలోని వారి నివాసానికి వెళ్లి శకుంతలా దేవి పార్ధీవ దేహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం కొత్తపల్లి మధుసూదన్ రావు కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. MLA వెంట మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు హన్మంతరావు, నాయకులు అశోక్ యాదవ్, ప్రవీణ్ రెడ్డి, గోపిలాల్ చౌహాన్, కూతురు నర్సింహ, సర్దార్ కుల్వంత్ సింగ్ (టిల్లు బాయ్), బలరాం తదితరులు ఉన్నారు.