జూబ్లీహిల్స్, నవంబర్4: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 700 మంది రైతులు.. 165 మంది ఆటో డ్రైవర్లు.. 100 మంది గురుకుల విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని, కేసీఆర్ అమలు చేసిన పథకాలన్నీ అధోగతి పాలవుతున్నాయని.. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర.. మాజీ మంత్రి, ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ విమర్శించారు. కాంగ్రెస్ మోసాలు ప్రజలకు ఎన్నికలు అయిపోయాక అర్థమవుతున్నాయన్నారు.
యూసుఫ్‌గూడ డివిజన్ ఎల్ఎన్నగర్, కృష్ణానగర్‌లో మంగళవారం వారు గడప గడపకూ వెళ్లి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో అన్ని వర్గాలను మోసం చేసిందన్నారు. ప్రజలు మళ్లీ మోసపోవడానికి సిద్ధంగా లేరని చెప్పారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మాగంటి సునీతా గోపీనాథ్‌కు.. బ్యాలెట్లో 3వ నంబర్లో ఉన్న కారు గుర్తుకే ఓటు వేయాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఆశీష్ కుమార్ యాదవ్, శ్రీకాంత్, కార్పొరేటర్ హేమ, సీనియర్ నాయకులు వాసాల వెంకటేష్, పర్వతం సతీశ్, పవన్ రెడ్డి, మీర్ రహ్మత్ అలీ, సత్తారం సత్యనారాయణ, డి. విమల, షబ్బీర్, ఫహీం, చిన్నా యాదవ్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.