శంషాబాద్ రూరల్, మార్చి 19 : చేవెళ్ల ఎంపీగా బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గెలుపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ పిలుపునిచ్చారు. మంగళవారం శంషాబాద్ పట్టణంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గెలుపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రతి కార్యకర్త పనిచేసి చేవెళ్ల ఎంపీ స్థానాన్ని బహుమతిగా ఇవ్వాలని సూచించారు. పార్టీ కష్టాల్లో ఉన్న సమయంలో కొందరు నాయకులు పార్టీ మారినా.. కార్యకర్తలు మనోధైర్యం కోల్పోకుండా పనిచేయాలని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేసి దేశంలోనే తెలంగాణ రాష్ర్టాన్ని ఆదర్శంగా తయారు చేశారని చెప్పారు. ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రైతుల పంటలు ఎండిపోతున్నా.. పట్టించుకోవడంలేదని విమర్శించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గణేశ్‌గుప్త, మండల పార్టీ అధ్యక్షుడు కె.చంద్రారెడ్డి, మున్సిపల్ అధ్యక్షుడు వెంకటేశ్ గౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ సుష్మారెడ్డి, జడ్పీటీసీ తన్విరాజు, వైస్ చైర్మన్ బండి గోపాల్‌యాదవ్, ప్రధాన కార్యదర్శి మోహన్‌రావు, నీరటి రాజు, మోహన్‌నాయక్, సహకార సంఘం చైర్మన్లు బుర్కుంట సతీష్, దవాణాకర్గౌడ్, కౌన్సిలర్లు జాంగీర్‌ఖాన్, మేకల వెంకటేశ్, ఆయిల్కుమార్, అజేయ్, చెన్నం ఆశోక్, నాయకులు కె.శ్రీనివాస్, బుచ్చిరెడ్డి, జీవై ప్రభాకర్, పరంధాములు, ధన్‌పాల్‌రెడ్డి, జగన్మోహన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నేడు జిల్లా
శంషాబాద్ పట్టణంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో బుధవారం ఉదయం 9 గంటలకు చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనాయకులు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గెలుపు కోసం అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయనున్నట్లు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ తెలిపారు.