బంజారాహిల్స్ : బంజారాహిల్స్‌లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో చికిత్స కోసం వివిధ ప్రాంతాలనుంచి వచ్చే రోగుల సహాయకుల కోసం కేబీఆర్ పార్కు వాకర్లు స్వచ్చంద సంస్థ ద్వారా ప్రతివారం అన్నదానం కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించారు.
స్నేహ హస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి శుక్రవారం 300 మందికి అన్నదానం నిర్వహిస్తామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు మహ్మద్ ఖతాల్ హుస్సేన్, భరత్ భూషణ్, రామ్‌కుమార్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.