సిటీబ్యూరో, జూన్ 10 (నమస్తే తెలంగాణ ) : వర్షాకాలంలో ప్రమాదాల నివారణ, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సహాయ చర్యలపై జీహెచ్ఎంసీ ఈవీడీఎం విభాగం శిక్షణను ఇచ్చింది. నాగోల్ ఫతుల్లాగూడలోని ట్రైనింగ్ సెంటర్లో సోమవారం ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
వరదలతో ముంపు, ప్రాణాపాయ పరిస్థితులు, ఆస్తినష్టం జరుగుతున్నందున ముందస్తు జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి? ప్రమాదం జరిగినప్పుడు ఏమి చేయాలి అన్న విషయాలపై ఒక్క రోజు శిక్షణ ఇచ్చినట్లు ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాశ్‌రెడ్డి తెలిపారు. 160 మంది వలంటీర్లు పాల్గొన్నారన్నారు. ఆసక్తి ఉన్న అపార్ట్మెంట్, బస్తీవాసులు, ఎన్జీవో సభ్యులు, ట్రేడ్ యూనియన్ సభ్యులకు ఉచిత శిక్షణ అందిస్తామని, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ 7981665687 నంబర్లో సంప్రదించాలని డైరెక్టర్ సూచించారు.