పహాడీషరీఫ్, నవంబర్ 13: జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని వాది ఏ ముస్తఫా, వాది హుదా, న్యూ హు దా, ముస్తఫా హిల్స్, ఐలే హాదీస్, ముస్తఫా కాలనీ, మదీనకాలనీవాసులు రేషన్ కోసం నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న జల్పల్లి గ్రామానికి వెళ్లేవారు. నెలనెలా రేషన్ కోసం తీవ్ర ఇబ్బందులు పడేవారు.. గతంలో అధికారులు, ప్రజాప్రతినిధులకు రేషన్‌షాపు ను స్థానికంగా ఏర్పాటు చేయాలని విన్నవించుకున్నా ఏ ఒక్కరూ పట్టించుకోలేదు.. అయితే.. తెలంగాణ ప్రభుత్వంలో మంత్రి సబితాఇంద్రారెడ్డి దృష్టికి సమస్యను తీసుకెళ్లగా.. స్థానికంగా తాత్కాలికంగా ఏర్పాటుకు కృషి చేశారు.. శాశ్వత రేషన్ షాపు ఏర్పాటు చే సే వరకు నెలలో 5 రోజులు రేషన్ ఇచ్చేటట్లు చేశారు. దీంతో తమ కష్టాలు తీరాయని.. ఇన్నేండ్లు పడ్డ ఇబ్బందులకు ఉపశమనం కలిగిందని స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తూ.. మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
కాలనీలోనే రేషన్ ఇస్తున్నారు
కాలనీలోనే రేషన్ దుకాణం ఏర్పాటు చేసి రేషన్ ఇస్తున్నారు. ఏండ్లుగా రేషన్ తెచ్చుకోవడానికి చాలా ఇబ్బందులు పడ్డాం. గతంలో నాలుగు కిలోమీటర్లు ప్రాయాణించి రేషన్ తెచ్చుకోవాలంటే చాలా ఇబ్బందులు పడేది. ఆటోకు వంద రూపాయలు ఖర్చు అయ్యేటివి. రేషన్ షాపు ఏర్పాటు చేసిన స్థానిక కౌన్సిలర్, మంత్రి సబితా ఇంద్రారెడ్డికి కృతజ్ఞతలు.
శాశ్వత ఏర్పాటుకు కృషి
మంత్రి ఆదేశంతో కాలనీలో తాత్కాలిక రేషన్ షాపు ఏర్పాటు చేశాం. ఏండ్లుగా ఇబ్బందులకు గురైన స్థానికులు కాలనీలోనే రేషన్ ఇస్తుండటంతో కృతజ్ఞతలు తెలుపుతున్నారు. మంత్రి సహకారంతో శాశ్వత రేషన్ షాపు ఏర్పాటుకు కృషి చేస్తున్నాం.