నెలాఖరుకు.. సీడీఈడబ్ల్యూ సెంటర్లు
సేఫ్ సిటీ ప్రాజెక్ట్‌లో భాగంగా మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో చేపడుతున్న సీసీటీవీల నెట్వర్క్ కనెక్షన్లు, ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్‌లు, సెంటర్ ఫర్ డెవలప్మెంట్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్, పెలికాన్స్ సిగ్నల్స్, అవుట్‌రీచ్ వెహికిల్స్, భరోసా కేంద్రాలు, మొబైల్ షీ టాయిలెట్స్ వంటి ప్రాజెక్ట్‌లను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని సేఫ్ సిటీ ప్రాజెక్ట్ నోడల్ అధికారి, నగర పోలీస్ కమిషనర్ సీవీ.ఆనంద్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
- ఆగస్టులోపు సీసీటీవీ నెట్వర్క్, ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్‌ల ఏర్పాటు
- సేఫ్ సిటీ ప్రాజెక్ట్‌పై నిర్వహించిన
- ఉన్నత స్థాయి సమీక్షలో నగర సీపీ సీవీ.ఆనంద్
సిటీబ్యూరో, మే 6 (నమస్తే తెలంగాణ): సేఫ్ సిటీ ప్రాజెక్ట్‌లో భాగంగా మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో చేపడుతున్న సీసీటీవీల నెట్వర్క్ కనెక్షన్లు, ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్‌లు, సెంటర్ ఫర్ డెవలప్మెంట్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్, పెలికాన్స్ సిగ్నల్స్, అవుట్‌రీచ్ వెహికిల్స్, భరోసా కేంద్రాలు, మొబైల్ షీ టాయిలెట్స్ వంటి ప్రాజెక్ట్‌లను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని సేఫ్ సిటీ ప్రాజెక్ట్ నోడల్ అధికారి, నగర పోలీస్ కమిషనర్ సీవీ.ఆనంద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం బంజారాహిల్స్‌లోని నూతన పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అదనపు డీజీ(ఉమెన్ సేఫ్టీ) షికాగోయల్, సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, రాచకొండ సీపీ డీఎస్.చౌహాన్‌లతో కలిసి సీపీ సీవీ.ఆనంద్ సేఫ్ సిటీ ప్రాజెక్ట్‌పై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా 26 సీడీఈడబ్ల్యూ (సెంటర్ ఫర్ డెవలప్మెంట్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్)కేంద్రాల ఏర్పాటు ఈనెలాఖరు వరకు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. సీసీటీవీలకు సంబంధించిన కనెక్టివిటీ సమస్యలను పరిష్కరించడం, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లకు అవసరమైన కొత్త పరికరాలను కొనుగోలు చేసి వాటిని ఆగస్టులోపు ఏర్పాటు చేయాలన్నారు. డయల్ 100కాల్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ప్రధానంగా ఆపదలో ఉన్న మహిళలు, చిన్నపిల్లల నుంచి వచ్చే కాల్స్ వచ్చినప్పుడు పెలికాన్ సిగ్నల్స్‌ను ఆపరేట్ చేయడానికి వాలంటీర్లకు అవసరమైన శిక్షణ ఇవ్వాలని, అనుభవజ్ఞులను ఏర్పాటు చేయాలని సూచించారు.
బరోసా కేంద్రాలకు సంబంధించిన భవనాల ఏర్పాటుపై సైతం ఆయన సమీక్షించారు. నగరంలోని రద్దీ ప్రాంతాల్లో షీ-మొబైల్ టాయిలెట్స్‌ను ఏర్పాటు చేయడమే కాకుండా వాటి లొకేషన్లను, నిర్వహణ, తదితర అంశాలను కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షించాలన్నారు. పరిపాలనా పరమైన అంశాలపై సైతం సమీక్షించారు. ఈ సమావేశంలో అదనపు సీపీ (క్రైమ్స్) ఏ.ఆర్.శ్రీనివాస్, అదనపు సీపీ (ట్రాఫిక్) జి.సుధీర్‌బాబు, ఇతర ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

