కుప్పకూలుతున్న ఇంజినీరింగ్ శాఖ
ట్రై కార్పొరేషన్లో కీలకమైన ఇంజినీరింగ్ విభాగంలో నాథుడు లేని చందంగా మారింది. ఇంజనే లేకపోతే బండి ఎలా ఆగిపోతుందో..ప్రస్తుతం ఈ శాఖ పరిస్థితి అలాగే తయారైనది.
సిటీబ్యూరో/ మల్కాజిగిరి, జూలై 3 (నమస్తే తెలంగాణ): ట్రై కార్పొరేషన్లో కీలకమైన ఇంజినీరింగ్ విభాగంలో నాథుడు లేని చందంగా మారింది. ఇంజనే లేకపోతే బండి ఎలా ఆగిపోతుందో..ప్రస్తుతం ఈ శాఖ పరిస్థితి అలాగే తయారైనది. ముఖ్యమంత్రి పర్యవేక్షణలోనే ఉన్న ఈ విభాగంలో పాలన పూర్తిగా గాడి తప్పిందని అనడానికి గడిచిన నెల రోజులుగా జరుగుతున్న బదిలీలే ఇందుకు నిదర్శనం.
ఒకవైపు అదనపు బాధ్యతల భారం, మరోవైపు దక్కని పదోన్నతులు..ఇంకోవైపు నెల రోజులుగా సాగుతున్న రాజకీయ బదిలీల బంతాటలో క్షేత్రస్థాయిలో ఇంజినీరింగ్ వ్యవస్థ కుప్పకూలి..ఈ ప్రభావం అభివృద్ధి పనులపై తీవ్ర ప్రభావం పడుతున్నది. పనిచేస్తున్న అరకొర ఇంజినీర్లకు అదనపు బాధ్యతలు అప్పగించడంతో వారు తీవ్ర ఒత్తిడికి లోనవుతుండడం, సంవత్సరాలుగా ఒకే పోస్టులో మగ్గుతున్న అర్హులైన అధికారులకు పదోన్నతులు కల్పించడంలో ప్రభుత్వం విఫలం చెందింది.
సీనియారిటీ జాబితాల గందరగోళం, కాలయాపన ధోరణితో అధికారుల్లో నైరాశ్యం ఆవరించింది. ప్రజలకు అందాల్సిన అభివృద్ధి ఫలాలు అందకుండా పోతున్నాయి. జీహెచ్ఎంసీ విభజన, శివారు ప్రాంతాల విలీనంతో హడావిడిగా కొత్త జోన్లను ఏర్పాటు చేసిన ప్రభుత్వం… దానికి సరిపడా సిబ్బందిని, అధికారులను కేటాయించడంలో పూర్తిగా విఫలమైనది. ఇక క్షేత్రస్థాయిలో పనులను పర్యవేక్షించాల్సిన ఏఈల పోస్టులు ఏకంగా 75 శాతానికి పైగా ఖాళీగా ఉన్నాయి.
దాదాపు 80 శాతం సరిళ్లకు పూర్తిస్థాయి ఈఈలు లేరు. అంతా ఇన్చార్జ్ల భరోసాతోనే నడుస్తోంది. నాగోల్లో 5 డివిజన్లకు ఒక్కడే ఏఈ ఉన్నారు. ఎల్బీనగర్ సర్కిల్లో 5 డివిజన్లకు ఇద్దరు ఏఈలు ఉన్నారు. సరూర్నగర్ సర్కిల్లో 7 మంది ఉండాల్సి ఉండగా 4 ఏఈలు పనిచేస్తున్నారు. హయత్నగర్లో ఆరు డివిజన్లకు ఒక్కరే ఏఈ పనిచేస్తున్నారు. కాప్రా, నాచారం సరిల్స్లో 10 మంది ఏఈలకు 5 గురే పనిచేస్తున్నారు. మల్కాజిగిరి, మౌలాలి సర్కిల్లో 9 మంది డివిజన్లకు ఇద్దరే పనిచేస్తుండగా, ఇందులో ఒకరు లాంగ్ లీవ్లో ఉన్నారు. అల్వాల్ సర్కిల్లో ఆరు డివిజన్లకు ముగ్గురే ఏఈలు విధులు నిర్వహిస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Leaders: జంతర్ మంతర్లోకి చొరబాటు.. 5 రోజుల కస్టడీలోకి సీజేపీ నేతలు
జగిత్యాల జిల్లాలో విషాదం.. వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
Cult | ‘కల్ట్’ వాయిదా పడినట్టేనా .. విశ్వక్ సేన్ సినిమా రిలీజ్పై ఇంకా రాని క్లారిటీ!
Viral Video | కాంగ్రెస్కు దగ్గరుండి ఓట్లు వేయించిన.. ఇప్పుడు నా చేనే ఎండబెట్టిండ్రు.. నాగర్కర్నూల్ జిల్లాలో రైతు గోపాల్ ఆవేదన
Sai Pallavi | జగపతిబాబు షోలో సాయి పల్లవి సందడి.. ‘జయమ్ము నిశ్చయమ్మురా’ రెండో సీజన్ ఎప్పటినుండి అంటే..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

