Hayath Nagar | హయత్ నగర్, జూలై 14 : హయత్ నగర్ మండల రెవెన్యూ పరిధిలోని సర్వే నెం.159 లో అక్రమంగా వెలిసిన కంటైనర్ నిర్మాణాలను తొలగించినట్లు హయత్ నగర్ తహసిల్దార్ కే. జానకి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. తహాసీల్దార్ జానకి ఆదేశాల మేరకు డిప్యూటీ తహసిల్దార్ అనిల్ కుమార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ స్వాతి, జూనియర్ అసిస్టెంట్ వీరన్నతో కలిసి ఘటనా స్థలానికి చేరుకొని ప్రభుత్వ స్థలంలో అక్రమంగా వెలిసిన నిర్మాణాలను జేసీబీ సహాయంతో తొలగించారు. ప్రభుత్వ స్థలాన్ని కబ్జాకు ప్రయత్నించిన బీబీ రెడ్డిపై హయత్ నగర్ పోలీసులకు తాసిల్దార్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రభుత్వ స్థలాల్లో ఎలాంటి వ్యక్తులైన ఆక్రమణకు, కబ్జాకు పాల్పడినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.