కేపీహెచ్‌బీ కాలనీ, జనవరి 22: సమాజంలో పేదలందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్‌లో నియోజకవర్గానికి చెందిన 98 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదిముబారక్ చెక్కులను ఎమ్మెల్యే కృష్ణారావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ.. పేదింట్లో ఆడబిడ్డ పెండ్లి చేస్తే తల్లిదండ్రులు పడే కష్టాలు సీఎం కేసీఆర్‌కు తెలుసునని అందువల్లే కల్యాణలక్ష్మి షాదీముబారక్‌తో ఆబిడ్డకు పెద్దన్నలా పెండ్లికి ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో ఇప్పటి వరకు 15 వేల మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందించడం జరిగిందన్నారు. సంక్షేమ ఫలాలు పేదలకు అందించడం.. రాష్ర్టాన్ని అభివృద్ధి చేస్తూ ఆదర్శవంతమైన పాలన సీఎం కేసీఆర్ అందిస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సబీహాబేగం, మాజీ కార్పొరేటర్ తూము శ్రవణ్‌కుమార్ తదితరులున్నారు.
యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు
ఎనిమిదేండ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో పలు దేశాల పారిశ్రామిక వేత్తలు పెట్టుబడులు పెడుతున్నారని.. తద్వారా యువతకు వేలాది ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఆదివారం కూకట్పల్లి డివిజన్ వెంగళరావు నగర్ కమ్యూనిటీ హాల్లో యువతతో ‘ఆత్మీయ సమ్మేళనం’లో ఎమ్మెల్యే కృష్ణారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రం లో సుపరిపాలన కారణంగా ప్రపంచస్థాయి సంస్థలు హైదరాబాద్ నగరంలో పెట్టుబడులు పెడుతున్నాయని తద్వారా లక్షలాది మందికి ఉద్యోగాలు, పరోక్షంగా ఉపాధి అవకాశాలు పెరుగుతున్నట్లు తెలిపారు. యువతే దేశానికి ఎన్నెముకని.. కొందరు వ్యక్తులు యువతను తప్పుదారి పట్టిస్తున్నారన్నారు. యువత సన్మార్గంలో నడిచి రాష్ర్టానికి, దేశానికి సేవలందించాలన్నారు. కులం మతం పేరుతో పబ్బంగడిపే రాజకీయ పార్టీల నేతల ఉచ్చులో పడొద్దని బంగారు భవిష్యత్‌లో పాడు చేసుకోవద్దన్నారు. క్రమశిణతో చదువుకుని ఉద్యోగాలు సాధించాలని.. సమాజ అభ్యున్నతిలో భాగస్తులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ యువతనేత చైతన్య యాదవ్, సంతోశ్ యాదవ్, మహేశ్, కూకట్పల్లి డివిజన్ అధ్యక్షుడు సంతోశ్, కార్యదర్శి ప్రభాకర్ తదితరులున్నారు.