e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, November 28, 2021
Home హైదరాబాద్‌ బరువుగా బతుకీడ్చకుండా

బరువుగా బతుకీడ్చకుండా

  • ట్రాన్స్‌జెండర్లకు ఉపాధి దారి
  • జూట్‌ బ్యాగుల తయారీలో శిక్షణ
  • ప్రారంభించిన మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్‌ దివ్య దేవరాజన్‌
  • 45 రోజుల పాటు ఉచిత వసతి పేర్లు నమోదు చేసుకున్న 23 మంది ట్రాన్స్‌ జెండర్లు
  • ఒక్కరూ ఉద్యోగమివ్వరు. చిల్లిగవ్వ దానం చేయడానికీ విసుక్కుంటారు. ఎదురుపడితే

అసహ్యించుకుంటారు. కనబడితే చాలు.. ఓ లోకువ భావన. ప్రతి క్షణం ఇలాంటి దుఃఖపూరిత స్థితిలో చీత్కారాలకు లోనవుతూ దుర్భరంగా రోజులీడుస్తున్న ట్రాన్స్‌జెండర్లకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చక్కటి చేయూతనందిస్తున్నది. తలెత్తుకొని బతికేలా తమ కాళ్లపై తామే నిలబడేలా ఆత్మవిశ్వాసంతో సాగిపోయేలా మేలైన ఉపాధి మార్గాన్ని చూపిస్తున్నది. బరువుగా బతుకీడ్చకుండా జూట్‌ బ్యాగుల తయారీలో 45 రోజుల పాటు ప్రత్యేక శిక్షణ ప్రారంభించింది. సీఎం కేసీఆర్‌ సూచనల మేరకు ట్రాన్స్‌జెండర్లకు చక్కటి వసతి కల్పిస్తూనే ఆల్విన్‌ కాలనీలోని ఓ ప్రాంగణంలో అన్ని ఏర్పాట్లు చేశారు. వినూత్నమైన ఈ కార్యక్రమాన్ని రూపొందించిన ఆ శాఖ కమిషనర్‌ దివ్యదేవరాజన్‌ మంగళవారం శిక్షణ ప్రారంభించారు. ఇప్పటికే దీనికోసం 23 మంది ట్రాన్స్‌జెండర్లు పేర్లు నమోదు చేసుకోవడం గమనార్హం.

రోజూ మాకు అవహేళనలే

మమ్మల్ని చీదరించుకోనివారు లేరు. మా పరిస్థితి అర్థం చేసుకునే వారు ఉండరు. కష్టపడి పని చేసి పైసలు సంపాదిద్దామనుకున్నా..పని ఎవరిస్తారు? రోజూ మాకు అవహేళనలే ఎదురవుతుంటాయి. దుర్భరంగా జీవితాన్ని గడుపుతున్నాం. అట్లా బతుకుతున్న మాకు ప్రభుత్వమే జూట్‌ బ్యాగుల తయారీ శిక్షణ ఇవ్వడం సంతోషం. ఉచితంగా వసతి కూడా ఇచ్చారు. మాకు ట్రైనింగు ఇస్తే బతకగలమన్న నమ్మకం వస్తది. – వాణి (ట్రాన్స్‌జెండర్‌)

- Advertisement -

మియాపూర్‌ , అక్టోబర్‌ 26: ఇక పై వారికి హేళనలు, అవహేళనలొద్దని, వారికి స్వయం ఉపాధి కల్పించి ఆ దిశగా వారిని సమాజంలో అందరితో సమానంగా మెలిగేలా చేయాలని ప్రభుత్వం సంకల్పించి ట్రాన్స్‌జెండర్ల ఔన్నత్యానికి శ్రీకారం చుట్టిం ది. ఇంత కాలం ఉపాధి లేక, కుటుంబ పోషణకు మార్గా లు లేక, సమాజంలో తీవ్ర వివక్షకు గురవుతూ ట్రాన్స్‌ జెండర్లు నానా ఇబ్బందులు పడుతున్నారు. దేశ అత్యున్నత న్యాయస్థానం సైతం వారిని సమాజంలో అందరితో సమానంగా చూడాలని తీర్పులిచ్చినప్పటికీ, వాస్తవిక సమాజంలో ఇప్పటికీ సమానత్వం లభించక వివక్షతో బతుకులు ఈడుస్తున్నారు. కుటుంబాన్ని పోషించుకునేందుకు ఏ రంగాన్ని ఆశ్రయించినా ఉపాధి పరంగా ఛీత్కారమే తప్ప.. ఆదెరువు లభించని పరిస్థితులు నెలకొంటున్నాయి.

దీంతో విధిలేని పరిస్థితులలో తమను తాము పోషించుకునేందుకు రహదారులపై నానా హంగామా చేస్తూ సమాజంతో అవహేళనలు ఎదుర్కుంటున్న వారికి కొత్త జీవితాన్నిచ్చేందుకు తెలంగాణ సర్కారు నడుం బిగించింది. ఇప్పటికే పోలీస్‌ కమిషనరేట్‌లో ప్రత్యేక డెస్క్‌ ల ఏర్పాటు ద్వారా ట్రాన్స్‌జెండర్లకు సముచిత గుర్తింపు ఇచ్చే ప్రయత్నం ప్రారంభం కాగా, తాజాగా మహిళా అభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ వీరికి స్వయం ఉపాధి అవకాశాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది.

ఛీత్కారాలు, అవహేళనలతో కాకుండా సమాజంలో స్త్రీ పురుషులతో సమానంగా తమ కాళ్ల మీద తాము నిలబడేలా సీఎం కేసీఆర్‌ సూచన, సంబంధిత మంత్రి సత్యవతి రాథోడ్‌ ప్రత్యే క శ్రద్ధ, ఆ శాఖ కమిషనర్‌ దివ్య దేవరాజన్‌ వినూత్న ఆలోచనతో ట్రాన్స్‌ జెండర్లకు జూట్‌ బ్యాగుల తయారీలో శిక్షణ ద్వారా స్వయం ఉపాధికి శ్రీకారం చుట్టారు. ట్రాన్స్‌ జెండర్లకు ఈ శాఖ ద్వారా అందిస్తున్న ఈ శిక్షణ దేశంలోనే తొలిదిగా నిలవబోతున్నది. ఈ శిక్షణ కార్యక్రమాన్ని స్త్రీ శిషు సంక్షేమ శాఖ కమిషనర్‌ దివ్య దేవరాజన్‌ మంగళవారం శేరిలింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్‌ కాలనీ డివిజన్‌ పరిధిలో ఉన్న మహిళా ప్రాంగణంలో మంగళవారం ప్రారంభించారు.

జూట్‌ బ్యాగ్‌ల తయారీలో45 రోజుల శిక్షణ

ఆల్విన్‌ కాలనీ డివిజన్‌ పరిధిలో ఉన్న మహిళా ప్రాంగణంలో ‘ప్రభావన జ్యూట్‌ అండ్‌ అలైడ్‌ ఫైబర్స్‌ మల్టీస్టేట్‌ ఉమెన్స్‌ కో ఆపరేటివ్‌ సొసైటీ, ట్రాన్స్‌ ఈక్వాలిటీ సొ సైటీ అండ్‌ మౌంట్‌ ఫోర్డ్‌ సోషల్‌ ఇన్సిట్యూట్‌’ల సమన్వయంతో ట్రాన్స్‌ జెండర్లకు జూట్‌ బ్యాగుల తయారీలో శిక్షణ మంగళవారం మొదలైంది. 45 రోజులు శిక్షణ కొనసాగనున్నది. ఇందుకు గాను నగరంలోని పలు ప్రాంతాలకు చెందిన 23 మం ది ట్రాన్స్‌జెండర్లు నమోదు చేసుకున్నారు. మహిళా శిషు సంక్షేమ శాఖ కమిషనర్‌ దివ్య దేవరాజన్‌ ప్రత్యేక చొరవతో శిక్షణ నిర్వహణకు శాఖ ద్వారా రూ.5 లక్షల ప్రత్యేక నిధులను మంజూరు చేసింది. శిక్షణకు కావలసిన అధునాతన మిషన్లను సైతం ఇప్పటికే మహిళా ప్రాంగణంలో అందుబాటులో ఉంచారు.

ఉచిత శిక్షణ.. వసతి

జూట్‌ బ్యాగుల తయారీలో ట్రాన్స్‌జెండర్లు ట్రాన్స్‌ మహిళలకు ఇక్కడి మహిళా ప్రాంగణంలో ఉచిత శిక్షణ తాజాగా ప్రారంభమైంది. శిక్షణతో పాటు వారందరికీ ఇదే ప్రాంగణంలో అన్ని వసతులు కల్పించారు. ఉదయం అల్ఫాహారం మధ్యాహ్నం భోజనం రాత్రి డిన్నర్‌ సౌకర్యాన్ని ఇక్క డే కల్పిస్తున్నట్టు ప్రాంగణ అధికారిణి, డీఎం లక్ష్మీ కుమారి పేర్కొన్నారు.

ప్రభుత్వం మాకు అందిస్తున్న గొప్ప వరమిది

సమాజంలో దుర్భరమైన జీవితాన్ని అనుభవిస్తున్న హి జ్రాలు, ట్రాన్స్‌ మహిళలకు స్వయం ఉపాధి పరంగా ప్రత్యే క శిక్షణలకు శ్రీకారం చుట్టడం చాలా సంతోషకరం. ఇది ప్ర భుత్వం మాలాంటోళ్లకు సమాజంలో గౌరవంగా బతికేందుకు అందించిన గొప్ప వరం. ఆయా స్వచ్ఛంద సంస్థల తోడ్పాటుతో ప్రభుత్వం ట్రాన్స్‌ మహిళలకు జ్యూట్‌ బ్యాగు ల తయారీలో ప్రత్యేక శిక్షణను అందిస్తున్న విషయాన్ని తెలుసుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా 23 మందిని చైతన్యపరిచి కోర్సులో చేరేలా కృషి చేశా. ఇక్కడికొచ్చిన వారు శిక్షణ తీసుకునేందుకు సంతోషం వ్యక్తం చేశారు. – జాస్మిన్‌, వ్యవస్థాపకురాలు, ట్రాన్స్‌ ఈక్వాలిటీ సొసైటీ

ట్రాన్స్‌ మహిళలకు ఇదే తొలి స్వయం ఉపాధి

సమాజంలో వివక్షకు గురవుతున్న ట్రాన్స్‌జెండర్లు, ట్రా న్స్‌ మహిళలకు బతుకుపై భరోసా కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. సీఎం కేసీఆర్‌, మంత్రి సత్యవతి రాథోడ్‌ల ఆలోచన, సూచనల మేరకు వారికి స్వయం ఉపాధి కోసం ప్రత్యేక శిక్ష ణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. జూట్‌ బ్యాగ్‌ల తయారీలో శిక్షణను కూకట్‌పల్లి మహిళా ప్రాంగణంలో ప్రారంభిం చాం. ట్రాన్స్‌ మహిళలకు ఈ బ్యాగుల తయారీలో అందించబోతున్న శిక్షణ బహు శా దేశంలోనే మొదటిదిగా భావిస్తున్నాం. అతి త్వరలో వీరికి టూ, త్రీ వీలర్‌లో శిక్షణ కార్యక్రమాన్ని సైతం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం.- దివ్య దేవరాజన్‌, కమిషనర్‌, మహిళా అభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement