వినూత్న నిరసన
బోయిన్‌పల్లిలోని లక్ష్మీనరసింహయ్య కాలనీ బాపూజీనగర్ బస్తీల్లో విద్యుత్ కనెక్షన్లు తొలగించిన అనంతరం నిరూపయోగంగా ఉన్న పవర్ బోర్‌వెల్స్ మీటర్ బాక్స్‌లకు బుధవారం స్థానికులతో కలిసి బోర్డు మాజీ ఉపాధ్యక్షులు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు జక్కుల మహేశ్వర్‌రెడ్డి పూలదండలు వేసి నిరసన తెలిపారు.
కంటోన్మెంట్ ఫిబ్రవరి 4: బోయిన్‌పల్లిలోని లక్ష్మీనరసింహయ్య కాలనీ బాపూజీనగర్ బస్తీల్లో విద్యుత్ కనెక్షన్లు తొలగించిన అనంతరం నిరూపయోగంగా ఉన్న పవర్ బోర్‌వెల్స్ మీటర్ బాక్స్‌లకు బుధవారం స్థానికులతో కలిసి బోర్డు మాజీ ఉపాధ్యక్షులు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు జక్కుల మహేశ్వర్‌రెడ్డి పూలదండలు వేసి నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోర్డు నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మద, కంటోన్మెంట్ బోర్డు అధికారులు, ఎమ్మెల్యే శ్రీగణేశ్ సమస్యను పరిష్కరించని పక్షంలో విద్యుత్ బిల్లులు తానే చెల్లించి ప్రజల ఇబ్బందులు దూరం చేస్తానన్నారు. గతంలో దివంగత ఎమ్మెల్యే సాయన్న బాపూజీనగర్‌లో కమ్యూనిటిహాల్ నిర్మాణానికి, బస్తీ దవఖానకు నిధులు మంజూరు చేసి బోర్డు ఖాతాలో జమ చేశారని ఇప్పటివరకు బోర్డు అధికారులు పనులు చేపట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యే శ్రీగణేశ్, బోర్డు అధికారులు నిర్లక్ష్యం చేస్తే సొంత నిధులతో చింతల్బజార్లో కమ్యూనిటీహాల్, చిన్నతోకట్టలో రజకసంఘం భవనాలను సొంత నిధులతో చేపట్టిన మాదిరిగా బాపూజీనగర్‌లో కమ్యూనిటీహాల్ నిర్మాణాన్ని చేపడతామని చెప్పారు. కార్యక్రమంలో వార్డు అధ్యక్షుడు నరసింహరావు, మహిళ అధ్యక్షురాలు టి. పద్మ, బండిరాజు, నవీన్‌కుమార్, మల్లిఖార్జున్, భాస్కర్, అరవింద్ బాబు, సాగర్, రాము, శ్రీను, సౌజన్య. స్రవంతి. భవాని, మానస, హరికృష్ణ, నాని తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ACB Case | ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కీసర సీఐపై ఏసీబీ కేసు నమోదు
‘నీటి వనరుల సంరక్షణతో ప్రత్యామ్నాయ పంటల సాగు చేపట్టాలి’
POCSO | స్కూల్లో పరిచయమై పెళ్లి పేరుతో మోసం.. పాపకు జన్మనిచ్చిన బాలిక.. యువకుడిపై పోక్సో కేసు
Baby Food | ఆరు నెలల్లోపు పిల్లల ఆహారంలో వీటిని కలుపొద్దు : FSSAI
వలసదారులకు జేఎస్పీడబ్ల్యూ ఆధ్వర్యంలో అన్నదానం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

