Gruha Jyothi | గృహజ్యోతికి షాక్.. వేసవిలో లబ్ధిదారులకు బిల్లుల మోత
గృహజ్యోతి పథకం లబ్ధిదారులకు బిల్లుల షాక్ తగిలింది. మార్చి నెలలో విద్యుత్ మీటర్లు గిర్రున తిరిగేశాయి. ఫలితంగా 200 యూనిట్ల లోపు ఉండాల్సిన కరెంటు వినియోగం కాస్తా 250 నుంచి 300 యూనిట్లు దాటింది. దీంతో అంతకు ముందు గృహజ్యోతి పథకానికి అర్హులుగా గుర్తించిన వారిలో సుమారు 10 లక్షల మంది ఒక్కసారిగా నిరుత్సాహానికి గురయ్యారు.
- మార్చి నెలలో గిర్రున తిరిగిన మీటర్లు
- ఏప్రిల్, మేలోనూ ఇదే తీరు
- 21 సర్కిళ్లలో 36 లక్షలు మంది అర్హులు
- 10 లక్షల మందికి 200 యూనిట్లు దాటిన కరెంటు బిల్లులు
Gruha Jyothi | సిటీబ్యూరో: గృహజ్యోతి పథకం లబ్ధిదారులకు బిల్లుల షాక్ తగిలింది. మార్చి నెలలో విద్యుత్ మీటర్లు గిర్రున తిరిగేశాయి. ఫలితంగా 200 యూనిట్ల లోపు ఉండాల్సిన కరెంటు వినియోగం కాస్తా 250 నుంచి 300 యూనిట్లు దాటింది. దీంతో అంతకు ముందు గృహజ్యోతి పథకానికి అర్హులుగా గుర్తించిన వారిలో సుమారు 10 లక్షల మంది ఒక్కసారిగా నిరుత్సాహానికి గురయ్యారు. మార్చి నెల నుంచి 200 యూనిట్ల లోపు విద్యుత్‌ను వినియోగించే వారికి ‘గృహజ్యోతి’ అమలు చేసేస్తామని ప్రకటించిన తర్వాత రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల పరిధిలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. మరోవైపు మార్చి నెలలో విపరీతమైన ఎండల కారణంగా విద్యుత్ వినియోగం రికార్డు స్థాయిలో పెరిగింది. ఫలితంగా 200 యూనిట్లలోపు రావాల్సిన కరెంటు బిల్లులు ఒక్కసారిగా మోతమోగడంతో గృహజ్యోతి లబ్ధిదారులు నిరాశచెందారు.
మొత్తం 21 సర్కిళ్లలో..
టీఎస్ఎస్పీడీసీఎల్ పరిధిలో మొత్తం 21 సర్కిళ్లు ఉండగా, అందులో సుమారు 36 లక్షల మందిని అర్హులుగా గుర్తించారు. వీరందరికీ మార్చి నుంచి ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేసేందుకు మీటర్ రీడింగ్‌లో 200 యూనిట్ల కంటే తక్కువ వచ్చిన వారందరికీ ఫిబ్రవరి నెలకు సంబంధించి జీరో బిల్లులు జారీ చేస్తూ వచ్చారు.అదే సమయంలో రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల పరిధిలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఆయా జిల్లాల్లో జీరో బిల్లులు ఇవ్వలేదు. మార్చిలో మధ్యలోనే పార్లమెంటు ఎన్నికల కోడ్ రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. దీంతో గృహజ్యోతి అమలు ఎక్కడిది అక్కడే అన్నట్లు నిలిచిపోయింది.
మూడు నెలలు ఆగాల్సిందే..
ముఖ్యంగా గ్రేటర్ పరిధిలోని 9 సర్కిళ్లలో 60.80 లక్షల మంది విద్యుత్ వినియోగదారులు ఉన్నారు. అందులో గృహజ్యోతి లబ్ధిదారులు గ్రేటర్‌లోనే అధికంగా ఉన్నారు. ప్రస్తుతం ఏప్రిల్ మొదటి వారంలో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగింది. 2వ తేదీన 83.84 మిలియన్ రికార్డు యూనిట్లు నమోదయ్యాయి. మే నెల సైతం ఇంతకు మించి ఉండే అవకాశం ఉంటుందని.. సుమారు 90 మిలియన్ యూనిట్లు దాటుతుందని అంచనా వేశారు. ఇలా విద్యుత్ వినియోగదారులకు బిల్లులు మోత మోగుతుండగా, గృహజ్యోతి లబ్ధ్దిదారులకు ఈ మూడు నెలలు ఉచితం దక్కనట్లేనని చెప్పవచ్చు.
టీఎస్ఎస్పీడీసీఎల్ డిస్కం పరిధిలో..
మొత్తం కనెక్షన్లు (21 సర్కిళ్లు) -1.13 కోట్లు
జీహెచ్ఎంసీ పరిధిలో ( 9 సర్కిళ్లు) మొత్తం విద్యుత్ కనెక్షన్లు – 60.80 లక్షలు
మొత్తం డిస్కం పరిధిలో గృహ జ్యోతి పథకం లబ్ధిదారులు సుమారు – 36 లక్షల మంది
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

