Jubilee Hills By Elections | జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు రాష్ట్ర ఎన్నికల సంఘం పరిశీలకులను నియమించింది. ముగ్గురు సీనియర్ అధికారులను పరిశీలకులుగా నియమించింది. సాధారణ పరిశీలకుడిగా ఐఏఎస్ రంజిత్ కుమార్, పోలీస్ పరిశీలకుడిగా ఐపీఎస్ ఓంప్రకాశ్ త్రిపాఠి, వ్యవ పరిశీలకుడిగా ఐఆర్ఎస్ అధికారి సంజీవ్ నియమితులయ్యారు.
బిహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు, పలు రాష్ట్రాల్లోని అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్న ఉప ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టిసారించింది. ఎన్నికల పర్యవేక్షణ కోసం వివిధ సర్వీసులకు చెందిన 470 మంది సీనియర్ అధికారులను నియమించింది. ఈ క్రమంలోనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం ముగ్గురు సీనియర్ అధికారులను పరిశీలకులుగా నియమించించింది.
సాధారణ పరిశీలకుడిగా ఐఏఎస్ రంజిత్ కుమార్, పోలీస్ పరిశీలకుడిగా ఐపీఎస్ ఓంప్రకాశ్ త్రిపాఠి, వ్యవ పరిశీలకుడిగా ఐఆర్ఎస్ అధికారి సంజీవ్‌ను ఎన్నికల సంఘం నియమించింది. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకే పరిశీలకులను నియమిస్తున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. వీరు ప్రధానంగా అభ్యర్థులు చేసే ఎన్నికల ఖర్చుపై నిఘా పెడతారు.