అడ్డగుట్ట, జనవరి 21 : ఇంట్లోకి చొరబడి వృద్ధురాలిని బెదిరించి.. బంగారు ఆభరణాలను అపహరించుకొని వెళ్లిన సంఘటన లాలాగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఈస్ట్ మారేడ్‌పల్లిలోని హరిహంత్ సదన్ అపార్టుమెంట్లో బాల రుక్మిణి (80) తన కుమారుడితో కలిసి ఉంటున్నారు. బుధవారం ఆమె కుమారుడు పనికి వెళ్లడంతో ఇంట్లో ఒంటరిగా ఉన్నారు. 9.30 గంటల సమయంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి బాల రుక్ష్మిణిని బెదిరించారు.
అనంతరం ఆమె వద్ద నుంచి సుమారు 8 తులాల బంగారు గొలుసు, రెండు గాజులను లాక్కొని పారిపోయారు. బాధితురాలు కేకలు వేయడంతో పక్క ఫ్లాట్‌లో ఉండే వారు బయటికి వచ్చి చూసేసరికి నిందితులు వెళ్లిపోయారు. వారిద్దరిలో ఒకరు క్యాప్ ధరించి ఉన్నారని, వారి వయస్సు సుమారు 30 నుంంచి 35 సంవత్సరాల మధ్య ఉన్నట్లు బాధితురాలు తెలిపారు.