కాచిగూడ, ఏప్రిల్ 20: రైలు ఢీకొని గుర్తుతెలియని వృద్ధుడు మృతి చెందిన సంఘటన కాచిగూడ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. హెడ్ కానిస్టేబుల్ సమ్మయ్య తెలిపిన వివరాల ప్రకారం.. గుర్తుతెలియని వృద్ధుడు(65)ఆదివారం మలక్ పేట.. డబీర్ పూర రైల్వే స్టేషన్ల మధ్య పట్టాలు దాటుతుండగా అదే సమయంలో గుర్తుతెలియని రైలు ఢీకొనడంతో ఆ వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దావకానకు తరలించారు. వంటిపై నీలి రంగు చొక్కా, ఆకుపచ్చ రంగు లుంగీ ధరించి, ఎత్తు 5.2 ఉన్నట్లు తెలిపారు. వృద్ధుని వివరాల కోసం 9948695948 లో సంప్రదించాలని హెడ్ కానిస్టేబుల్ తెలిపారు.