హైదరాబాద్ : డేటింగ్ యాప్స్ ద్వారా కొందరు పబ్ యజమానులు కస్టర్లను మోసం చేస్తున్న మోష్ పబ్ కేసులో పోలీసులు దర్యాప్తులో వేగం పెంచారు. ఢిల్లీ నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి టిండర్, ఇతర డేటింగ్ యాప్స్‌తో వ్యాపారులకు, విద్యార్థులకు వల వేస్తూ తప్పించుకు తిరుగుతున్న పలువురిని పోలీసులు అరెస్ట్(Arrested) చేశారు. వ్యాపారులు, విద్యార్థులకు పబ్‌కి వచ్చేలా చేసి ఖరీదైన మద్యం తాగించి లక్షల రూపాయలు కొల్లగొడుతున్నారు.
ఈ అక్రమ దందా గత కొంతకాలంగా గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతున్నది. ఇటీవల ఓ వ్యక్తి రితిక అనే మహిళను డేటింగ్ యాప్‌లో కలిసి మోసపోవడంతో అసలు విషయం బయటపడింది. దీంతో హైదరాబాద్ (Hyderabad) పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. అందులో భాగంగా మోష్ పబ్(Mosh pub) ప్రతినిధులతో పాటు 8 మందిని అరెస్ట్ చేశారు.