Solve problems with Walking | పాదయాత్రలతో సమస్యల పరిష్కారానికి కృషి : ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్
గోల్నాక : నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృతంగా పాదయాత్రలు చేపడుతూ స్థానిక సమస్యల పరిష్కారానికి సత్వరమే చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. శుక్రవారం గోల్నాక తులసీనగర్ కాలనీ సాయిబాబా గుడి లేన్, అశోకానగర్, లక్ష్మినగర్ తదితర ప్రాంతాల్లో పలు శాఖల అధికారులతో కలసి ఆయన క్షేత్రస్థాయిలో పాదయాత్ర నిర్వహించారు.
స్థానికులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. ముఖ్యంగా తమ బస్తీల్లో కలుషిత మంచినీటి సమస్య పరిష్కరించాలని స్థానికులు ఎమ్మెల్యే దృష్టకి తీసుకువచ్చారు. అలాగే అరకొర మంచినీటి సరఫరాతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే సమస్యను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
అశోక్‌నగర్, లక్ష్మినగర్ తదితర ప్రాంతాల్లో కొత్త మంచినీటి పైప్‌లైన్ ఏర్పాటు కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలేరు మాట్లాడుతూ…నియోజకవర్గ వ్యాప్తంగా మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధన్యతనిస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో సీజీఎం ఆనంద్‌నాయక్, జీఎం సుబ్బారాయుడు, డీజీఎం బ్రహ్మారెడ్డి, మేనేజర్ రోహిత్‌తో పాటు స్థానిక టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

