స్థానిక కాలనీవాసుల వినతికి స్పందించిన ఎమ్మెల్యే
వసతులు కల్పిస్తానని హామీ
చర్లపల్లి, జనవరి 18 : నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి పేర్కొన్నారు. చర్లపల్లి డివిజన్‌కు చెందిన టీఆర్ఎస్ నాయకులు మంగళవారం ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డిని కలిసి కుషాయిగూడ ప్రభుత్వ పాఠశాలను మరింత అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుషాయిగూడ ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి కోసం ఇప్పటికే సుమారు రూ.56లక్షల నిధులు కేటాయించి పలు అభివృద్ధి పనులు చేపట్టామని, పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సింగిరెడ్డి ధన్‌పాల్‌రెడ్డి, నాయకులు గరిక సుధాకర్, ఎంపెల్లి పద్మారెడ్డి, సారా అనిల్ ముదిరాజ్, గంప కృష్ణ, ఉపేందర్, వినోద్ ముదిరాజ్, బొడిగె రాజుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
కాలనీల సమగ్రాభివృద్ధికి కృషి
నియోజకవర్గ పరిధిలోని కాలనీల సమగ్రాభివృద్ధికి నిధులు కేటాయించి పనులు చేపడుతున్నామని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి పేర్కొన్నారు. ఏఎస్‌రావునగర్ డివిజన్ పరిధిలోని కమలానగర్ సంక్షేమ సంఘం నూతన కమిటి సభ్యులు ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డిని కలిసి పలు సమస్యలను ఆయనకు వివరించిన అనంతరం సన్మానించారు. ఈ కార్యక్రమంలో సంక్షేమ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు బేతాల బాల్‌రాజు, పైళ్ల శంకర్‌రెడ్డి, సలహాదారులు బొజ్జ రాఘవరెడ్డి, ఏవీఆర్.దత్తు, పెంటయ్యగౌడ్, వెంకటరెడ్డి, నాయకులు జనార్దన్, రామచంద్రరావు, మనోహర్‌రావు, మధుసూదన్‌రెడ్డి, సహదేవ్, సుధాకర్‌రావు, మాధవరావు, చిన్నయాదవ్, టీఆర్ఎస్ నాయకులు గరిక సుధాకర్, ముత్యంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.