రోడ్లు వేసినా.. డ్రైనేజీ వేసినా.. తాగునీళ్లు ఇచ్చినా.. మోదీ పైసలే అంటూ బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అసలు రాష్ర్టానికి కేంద్రం ఇచ్చిందేందో చెప్పాలని విద్యాశాఖ మంత్రి పి. సబితాఇంద్రారెడ్డి ప్రశ్నించారు. బీఆర్ఎస్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎక్కడా లేవని, అసత్య ప్రచారాలను అలవాటుగా చేసుకున్న కమలం నేతలను గులాబీ కార్యకర్తలు నిలదీయాలని మంత్రి పిలుపునిచ్చారు. మహేశ్వరం మండలం మన్సాన్పల్లిలో మంగళవారం నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి సబితారెడ్డి, జడ్పీ చైర్పర్సన్ తీగల అనితా హరినాథ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రిని కార్యకర్తలు ఊరేగించి భారీ గజమాలతో సత్కరించారు.
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ నేతలు కేంద్రం నుంచి ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు డిమాండ్ చేశారు. కేంద్రానికి రాష్ట్రం నుంచి పన్నుల రూపంలో వెళ్లిన నిధులే ఎక్కువగా ఉన్నాయని.. రాష్ర్టానికి రావాల్సిన నిధులపై కేంద్ర తీవ్ర జాప్యం చేస్తుందని ఆయన మండిపడ్డారు. కూకట్పల్లి బాలాజీనగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సమక్షంలో వివేక్‌నగర్ డివిజన్‌కు చెందిన బీజేపీ నేతలు మల్లేశ్, వేణు, సుధాకర్, సురేశ్‌తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
– బడంగ్‌పేట/కేపీహెచ్‌బీ కాలనీ, ఏప్రిల్ 11
బడంగ్‌పేట ఏప్రిల్ 11: సీఎం కేసీఆర్ రైతు పక్షపాతిగా రైతులకు అన్ని విధాలుగా భరోసా కల్పిస్తున్నారని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం మహేశ్వరం మండం మన్సాన్పల్లిలో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో జడ్పీ చైర్పర్సన్ తీగల అనితా హరినాథ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డితో కలిసి మంత్రి పాల్గొన్నారు. భారీ ఊరేగింపుగా ఆత్మీయ సమ్మేళనం ప్రాంగణానికి చేరుకున్నారు. భారీ గజమాలలతో మంత్రిని సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతుల కోసం సీఎం కేసీఆర్ రైతుబంధు, రైతు బీమా పథకాలు పెట్టి రైతుల కన్నీరు తుడుస్తున్నారని ఆమె పేర్కొన్నారు. వర్షాలు పడగానే రైతుబంధు నగదు రైతుల ఖాతాల్లో పడుతుందన్నారు. రైతులకు అవసరం అయిన విత్తనాలు, మందుల కొరత లేకుండా చూస్తున్నారని ఆమె తెలిపారు. ఏదైనా ప్రమాదం జరిగితే దినాలలోపే బాధిత రైతుకుంటాబానికి ఐదు లక్షల రూపాయాలు ఇస్తున్నామని, దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఈ పథకం ఉందో బీజేపీ నాయకులు చెప్పాలని డిమాండ్ చేశారు. రోడ్లు వేసినా, మంచి నీళ్లు ఇచ్చినా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నదని బీజేపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండి పడ్డారు. బీజేపీ నాయకుల అసత్య ప్రచారాన్ని తిప్పి కొట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు.
ప్రజల మీద ఏమాత్రం అభిమానం ఉన్నా గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలన్నారు. తప్పుడు ప్రచారం చేయడం బీజేపీ నాయకులకు అలవాటు అయిందన్నారు. ప్రజా సంక్షేమానికి కట్టుబడి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. కేసీఆర్ సీఎం అయిన తర్వాతనే రాష్ట్రం అన్ని రంగాల్లో సస్యశ్యామలంగా మారిందన్నారు. మహేశ్వరం నియోజక వర్గంలోని ప్రతి దళిత కుటుంబానికి దళితబంధు వస్తుందని మంత్రి స్పష్టం చేచశారు. ప్రభుత్వం ఉద్యోగాలను ఇస్తుంటే ఓర్వలేని బీజేపీ నాయకులు వాటిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. చివరకు పదవ తరగతి పరీక్ష ప్రశ్న పత్రాలను లీకేజీ చేసి విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
మహేశ్వరానికి అనేక కొత్త పరిశ్రమలు వస్తున్నాయని మంత్రి చెంప్పారు. విప్రో లాంటి కంపెనీలు ఈ ప్రాంతాలనికి రావడం వలన ఉపాధి అవకాశాలు మెరుగు పడుతాయన్నారు. స్థానికంగా ఉన్న యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. మరో హైటెక్ సిటీగా మహేశ్వరం మారబోతుందన్నారు. సంక్షేమానికి పెద్దపేట వేస్తున్న సీఎం కేసీఆర్‌ను మరోసారి ముఖ్య మంత్రిని చేయడానికి కార్యకర్తలు కంకణ బద్ధులై పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈనెల 25న జరిగే నియోజక వర్గం సభకు పెద్ద ఎత్తున తరలి రావాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు అంగోతు రాజునాయక్, వర్కింగ్ ప్రెసిడెంట్ వర్కల యాదగిరిగౌడ్, నియోజక వర్గ ఉపాధ్యక్షుడు హనుమగల్ల చంద్రయ్య, నియోజక వర్గం బీసీ సెల్ అధ్యక్షుడు మల్లేశ్‌యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ సురసాని సురేందర్‌రెడ్డి, లక్ష్మీనర్సింహారెడ్డి, సర్పంచ్‌లు కంది అరుణరమేశ్, మంత్రి సంధ్యారాజేశ్, అనితా ప్రభాకర్‌రెడ్డి, ముక్కెర యాదయ్య, లావణ్యలింగం, స్లీవారెడ్డి, థామస్‌రెడ్డి, మద్ధి సురేఖ కరుణాకర్‌రెడ్డి నాయకులు కూన యాదయ్యకో ఆప్షన్ సభ్యుడు సయ్యద్ ఆధిల్అలీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.