సిటీబ్యూరో, జనవరి 16 (నమస్తే తెలంగాణ): ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం ఉదయం పదిన్నరకు బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరవుతున్నారనే సమాచారం తెలుసుకొని బీఆర్ఎస్ శ్రేణులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నాయి. ఈ సందర్భంగా పోలీసులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను, మాజీ ఎమ్మెల్యేలను, కార్యకర్తలను ఎక్కడికక్కడే ఆపేశారు. పలువురు నాయకులను అరెస్ట్ చేసిన పోలీసులు కంచన్‌బాగ్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.