Drugs | కాచిగూడ, జూన్ 26 : దేశానికి అతిపెద్ద ప్రమాదం నిషేధిత డ్రగ్స్ ద్వారా పొంచి ఉందని, మన సమాజాన్ని కాపాడుకోవడం ముందున్న అతిపెద్ద సవాల్ అని ఈస్ట్ జోన్ డిసిపి డాక్టర్ బాలస్వామి అన్నారు. సెంట్రల్ పీస్ కమిటీ, ఈస్ట్ జోన్ పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో గురువారం కాచిగూడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అంతర్జాతీయ మాదకద్రవ్య దుర్వినియోగం – అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ముఖ్య అతిథిగా డీసీపీ హాజరై మాట్లాడుతూ.. విద్యార్థులు ద్రవ్యాలకు బానిసలు కావద్దని, డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని, అదేవిధంగా విద్యార్థులు ర్యాగింగ్‌తో విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. యువకుల జీవితాలను నాశనం చేస్తున్న డ్రగ్స్ మాఫియాపై విద్యార్థులు ఉక్కుపాదం మోపాలని పిలుపునిచ్చారు. దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లో ఉందని, డ్రగ్స్ నిర్మూలనలో విద్యార్థుల పాత్ర కీలకమైందని సూచించారు. విద్యార్థుల జీవితం ఎంతో విలువైందని, డ్రగ్స్‌తో ముడి పెట్టకూడదని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ నరసయ్య, కాచిగూడ డివిజన్ ఏసిపి హరీష్ కుమార్, కాచిగూడ సిఐ తల్లోజు జ్యోత్స్న, సెంట్రల్ పీస్ కమిటీ అధ్యక్షుడు నారాయణరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ శరత్ శ్యామ్, ఫరిదోద్దీన్, ఖలీద్ షా, శ్రీలత, శ్రీనివాసరావు, వీరేశం, గీతాబాయి, ప్రసాద్ రావు, అనిల్ రెడ్డి, ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ లక్ష్మయ్య గంగపుత్ర, లక్ష్మణ్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.