సిటీబ్యూరో : రానున్న 5 రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో.. అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. భారీ వర్షం కురిసే ప్రాంతాల్లో వాతావరణ శాఖ సూచనలతో పాఠశాలలకు ముందస్తు సెలవులు ప్రకటించాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.
నిబంధనలు పాటించని యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని సూచించారు. కలెక్టరేట్లో మంగళవారం భారీ వర్షాల ప్రభావం పై రెవెన్యూ, విద్య, వైద్య, అగ్ని, పోలీసు శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఎలాంటి నష్టం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు.సమావేశంలో లా ఆఫీసర్ వీరబ్రహ్మచారి, సీపీఓ డాక్టర్ సురేందర్, పలు విభాగాల అధికారులు పాల్గొన్నారు.