సిటీబ్యూరో, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ) : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు జీహెచ్ఎంసీ ప్రవేశపెట్టిన ఎర్లీబర్డ్ స్కీం గడువు సమీపిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరానికిగానూ ముందస్తుగా ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించే వారికి రాష్ట్ర ప్రభుత్వం 5 శాతం రిబేట్ ప్రకటించింది. ఈ నెల 1 నుంచి 30వ తేదీ వరకు ఈ వెసులుబాటు కల్పించింది. ఈ నేపథ్యంలోనే గడిచిన 24 రోజుల్లో దాదాపు 4.5 లక్షల మంది సద్వినియోగం చేసుకోగా…మంగళవారం సాయంత్రం వరకు దాదాపు రూ.30 కోట్లకు పైగా ఆదాయం వచ్చిందని, తద్వారా సుమారు 500 కోట్ల మేర ఆదాయం సమకూర్చుకున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ నెల 30వ తేదీ ఆదివారం సిటిజన్ సర్వీస్ సెంటర్లు తెరిచే ఉంటాయని అధికారులు పేర్కొన్నారు. కాగా గత ఆర్థిక సంవత్సరంలో ఎర్లీబర్డ్ స్కీం ద్వారా ఏకంగా రూ.741.35 కోట్ల మేర ఆదాయం సమకూర్చుకోగా.. ఈ సారి రూ. 750కోట్ల నిర్దేశిత లక్ష్యాన్ని ఖరారు చేసింది. ఈ మేరకు ఆయా లక్ష్యాలను కచ్చితంగా చేరుకోవాలని, డీసీలకు సూచించారు. దీంతో లక్ష్యం దిశగా చర్యలను వేగిరం చేశారు.

Hydp