ఈగల్ ఫోర్స్ భారీ ఆపరేషన్!
థాయ్‌లాండ్ నుంచి హైడ్రోపోనిక్ గంజాయి (ఓషన్ గాంజా)ని రహస్యంగా ఇండియాకు అక్రమంగా రవాణా చేస్తున్న సిండికేట్‌ను తెలంగాణ ఈగల్ ఫోర్స్ అధికారులు భారీ ఆపరేషన్ నిర్వహించి అరెస్టు చేశారు. మొత్తం 40 మందిని గుర్తించగా.. వారిలో కింగ్‌పిన్ సహా 15 మంది నిందితులను అరెస్టు చేసినట్లు తెలంగాణ ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ సందీప్ శాండిల్య తెలిపారు.
- రూ.12.7 కోట్ల డ్రగ్స్ స్వాధీనం
- థాయ్‌లాండ్ నుంచి ఇండియాకు అక్రమ రవాణా
- కింగ్‌పిన్ సహా ముంబైకి చెందిన 15 మంది అరెస్టు
- ఓజీ క్యారియర్స్‌లో 14 మంది తెలంగాణ యువకులు
హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ) : థాయ్‌లాండ్ నుంచి హైడ్రోపోనిక్ గంజాయి (ఓషన్ గాంజా)ని రహస్యంగా ఇండియాకు అక్రమంగా రవాణా చేస్తున్న సిండికేట్‌ను తెలంగాణ ఈగల్ ఫోర్స్ అధికారులు భారీ ఆపరేషన్ నిర్వహించి అరెస్టు చేశారు. మొత్తం 40 మందిని గుర్తించగా.. వారిలో కింగ్‌పిన్ సహా 15 మంది నిందితులను అరెస్టు చేసినట్లు తెలంగాణ ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ సందీప్ శాండిల్య తెలిపారు. ఈ మేరకు ఆయన ఐసీసీసీలో నిర్వహించిన మీడియా సమావేశంలో పలు విషయాలు వెల్లడించారు.
ఈ సిండికేట్‌లో కింగ్‌పిన్స్, ముంబయికి చెందిన గ్యాంగ్ స్టర్స్, షార్ప్ షూటర్స్ సహా 15 మందిని అరెస్ట్ చేశామన్నారు. ముం బాయి, ఢిల్లీ సహా అలహాబాద్‌లో నెల రోజులకు పైగా ఆపరేషన్ నిర్వహించామని.. శంషాబాద్, ఢిల్లీ, ముంబై ఎయి ర్ పోర్టుల మీదుగా తరలించేందుకు 150 మందిని క్యారియర్స్‌గా నియమించున్నట్లు తెలిపారు. అందులో తెలంగాణకు చెందిన 14 మంది యువకులు చిక్కుకున్నట్లు వెల్లడించారు. ఈ ఆపరేషన్ 12.739 కిలోల హైడ్రోపొనిక్ గంజాయిని సీజ్ చేసినట్లు తెలిపారు. దీని విలువ రూ.12.7 కోట్లు ఉంటుందని చెప్పారు.
ఈ అంతర్జాతీ య డ్రగ్స్ నెట్వర్లో దాదాపు 40 మంది కీలక పాత్రధారులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇందులో ముంబైకి చెందిన హేమంగ్ ప్రమోద్ కేలుసర్ ఈ ముఠాకు ప్రధాన లీడర్. ఇతని తమ్ముడు సుధాంశు ప్రమోద్ కేలుసర్ థాయిలాండ్‌లో ఉంటూ అకడి కార్యకలాపాలను చూసుకునేవాడు. గతంలో వీరు రూ.500 కోట్ల విలువైన ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో నిందితులుగా ఉన్నారు. 2023లో థాయిలాండ్‌లోని పట్టాయాలో జల్వా క్లబ్ అనే వ్యాపారంలో భాగస్వాములయ్యారు. అకడ భారతీయులను టార్గెట్ చేసి, మ్యూల్ క్యారియర్స్ (డ్రగ్స్ రవాణా చేసే కూలీలు) ద్వారా ఇండియాకు డ్రగ్స్ పంపడం ప్రారంభించారు.
ఈ క్యారియర్స్‌లో 14 మంది తెలంగాణ యువకులు ఉన్నారు. ప్రధాన నిందితులు థాయిలాండ్‌లో వైద్య అవసరాల ముసుగులో ఏకంగా 35 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ప్లేస్‌ను తీసుకొని 5 ఏళ్ల పాటు లీజుకు తీసుకుని అందులో గంజాయి సాగు చేస్తున్నారు. డ్రగ్స్ అమ్మగా వచ్చిన డబ్బును ముంబైకి చెందిన హవాలా ఆపరేటర్ల ద్వారా తిరిగి థాయిలాండ్‌కు పంపి, మళ్లీ డ్రగ్స్ వ్యాపారంలోనే పెట్టుబడిగా పెట్టేవారు. కస్టమ్స్ అధికారుల కళ్లు గప్పడానికి ఈ ముఠా సుమారు 300 మంది క్యారియర్లను ఉపయోగించినట్లు సాంకేతిక విశ్లేషణలో తేలిందని సందీప్ శాండిల్య తెలిపారు.
పట్టుకుంది ఇలా..
గత ఏప్రిల్ 7న శంషాబాద్ విమానాశ్రయంలో బ్యాంకాక్ నుండి వచ్చిన సోధా మోహ్సిన్ బహదూర్ భాయ్ అనే ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేయగా, అతడి వద్ద 13,200 గ్రాముల హైడ్రోపోనిక్ గంజాయి పట్టుబడింది. అతడితో పాటు వచ్చిన హర్షద్ మన్సుఖ్ భాయ్ ప్రజాపతి అనే మరో నిందితుడు డ్రగ్స్ కన్సైన్మెంట్తో తప్పించుకున్నాడు. మల్కాజిగిరీ ఈగిల్ఫోర్స్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ తన బృందంతో కలిసి రంగంలోకి దిగారు. తప్పించుకున్న హర్షద్, తన అసోసియేట్ సందీప్ వాస్వానీతో కలిసి బీహెచ్ఈఎల్ జంక్షన్ నుంచి బస్సులో ముంబై పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా అర్ధరాత్రి అరెస్టు చేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మంత్రిగారి సిఫార్సు.. మహా కుంభకోణం వివేక గంగాధరం!
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
రేవంత్ సర్కార్‌లో అన్నీ స్కామ్‌లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
కమీషన్ల కోసమే కొడంగల్-పేట ఎత్తిపోతలు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

