భూకబ్జాదారుల అరెస్టు
నకిలీ పత్రాలు తయారు చేసి, భూకబ్జాలకు పాల్పడుతున్న నిందితులను దుండిగల్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. బెంగళూరు నివాసి కృష్ణమూర్తికి గండిమైసమ్మ సమీపంలోని దొమ్మరపోచంపల్లిలో 300 గజాల స్థలం ఉన్నది.
దుండిగల్, ఫిబ్రవరి 11: నకిలీ పత్రాలు తయారు చేసి, భూకబ్జాలకు పాల్పడుతున్న నిందితులను దుండిగల్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. బెంగళూరు నివాసి కృష్ణమూర్తికి గండిమైసమ్మ సమీపంలోని దొమ్మరపోచంపల్లిలో 300 గజాల స్థలం ఉన్నది. స్థలానికి సంబంధించిన పాత డాక్యుమెంట్ల వివరాలు సేకరించిన కొందరు.. ఆ స్థలం ఆక్రమణకు తెరలేపారు. ఇందుకోసం లే అవుట్ చేసిన వ్యక్తి పేరిట నకిలీ డాక్యుమెంట్లు తయారు చేసి.. తమపేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.
ఇటీవల ఆ పత్రాలతో భూమిని అమ్మేందుకు ప్రయత్నిస్తుండగా.. విషయం తెలుసుకున్న కృష్ణమూర్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో భూకబ్జాకు పాల్పడిన వారిపై కేసు నమోదు చేశారు. నిందితులు కవాడిగూడ నివాసి సయ్యద్ ఆజం అలీ (47), మహ్మద్ మాజిద్ ఖాన్ (24), దుండిగల్‌కు చెందిన మహ్మద్ బాబాఖాన్(58) యూసఫ్‌గూడకు చెందిన సయ్యద్ ముజీబుల్లాఖాద్రీ (34), బీరాంగూడ నివాసి చౌదరి సతీశ్ బాబు(36), శేరిలింగంపల్లి నివాసి తెల్లాపురం విజయ్‌కుమార్(35)ను అరెస్ట్ చేసి, రిమాండ్‌కు పంపారు. భూకబ్జాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horoscope | 17-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
మంత్రిగారి సిఫార్సు.. మహా కుంభకోణం వివేక గంగాధరం!
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
రేవంత్ సర్కార్‌లో అన్నీ స్కామ్‌లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

