దుండిగల్ మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా
దుండిగల్ మున్సిపాలిటీని అన్ని రంగాల్లో ముందంజలో ఉంచేందుకు కృషి చేస్తున్నానని చైర్పర్సన్ సుంకరి కృష్ణవేణి కృష్ణ అన్నారు. శుక్రవారం దుండిగల్ మున్సిపల్ కౌన్సిల్ హాలులో కృష్ణవేణి అధ్యక్షతన సాధారణ సర్వసభ్య సమావేశం జరిగింది.
- చైర్పర్సన్ కృష్ణవేణి
దుండిగల్, డిసెంబర్ 30 : దుండిగల్ మున్సిపాలిటీని అన్ని రంగాల్లో ముందంజలో ఉంచేందుకు కృషి చేస్తున్నానని చైర్పర్సన్ సుంకరి కృష్ణవేణి కృష్ణ అన్నారు. శుక్రవారం దుండిగల్ మున్సిపల్ కౌన్సిల్ హాలులో కృష్ణవేణి అధ్యక్షతన సాధారణ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ముందస్తు బడ్జెట్‌ను చర్చించారు. అదే విధంగా మున్సిపాలిటీ పరిధిలో యానిమల్ కేర్ సెంటర్‌ను ఏర్పా టు చేయడానికి రూ.30 లక్షలను కేటాయిస్తూ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. అనంతరం కౌన్సిల్ సభ్యులు పలు సమస్యలను చైర్పర్సన్ దృష్టికి తీసుకురాగా వాటిని పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. మున్సిపాలిటీని ఆదర్శవంతంగా తీర్చిదిద్దడానికి కౌన్సిల్ సభ్యులు, అధికారులు సహకరించాలని ఆమె కోరారు. ఈ సమావేశంలో వైస్ చైర్మన్ తుడుం పద్మారావు, కమిషనర్ భోగీశ్వర్లు, గండిమైసమ్మ-దుండిగల్ తాసీల్ డీటీ సుధాకర్, మండల వైద్యాధికారి డా.నిర్మల, మున్సిపాలిటీ మేనేజర్ సునంద, రెవెన్యూ ఆఫీసర్ శ్రీహరిరాజు, రాజబాబు, సభ్యులు పాల్గొన్నారు.
మల్లంపేటలో సీసీరోడ్లు, భూగర్భడ్రైనేజీ పనులకు శంకుస్థాపన…
దుండిగల్ మున్సిపాలిటీ పరిధి మల్లంపేట 24, 25వ వార్డులలో రూ. 1.29 కోట్ల నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్లు, భూగర్భ డ్రైనేజీ పనులను చైర్పర్సన్ సుంకరి కృష్ణవేణి కృష్ణ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి ముందుకు సాగుతున్నామన్నారు. కౌన్సిలర్లు శంభీపూర్ కృష్ణ, అనంతస్వామి, మాదాసు వెంకటేశ్, ఎంబరి లక్ష్మి, గోపాల్‌రెడ్డి, శంకర్‌నాయక్, నిజాంపేట్ కార్పొరేటర్ బాలాజీ నాయక్, మాజీ సర్పంచ్ నర్సింగ్‌రావు, మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు మనోజ, ప్రధాన కార్యదర్శి రంగయ్య, మాజీ ఉప సర్పంచ్‌లు రాఘవేంద్రగౌడ్, అమర్నాథ్, ఆయా వార్డుల బీఆర్ఎస్ అధ్యక్షులు రమేశ్, లక్ష్మణ్, అమర్‌సింగ్, శోభన్, మాజీ వార్డు సభ్యులు ఉప్పరి బాలకృష్ణ, నర్సింహ, శ్రీనివాస గుప్త, శ్రీకాంత్ గుప్త, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

