శంషాబాద్ రూరల్, మార్చి 16 ః మద్యం మత్తులో భార్యను భర్త బస్సు కిందకు తోసిన సంఘటన శనివారం ఆర్ధరాత్రి శంషాబాద్ పట్టణంలో జరిగింది. స్థానికులు ,పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శంషాబాద్ పట్టణంలోని ఆర్టీసీ బస్‌స్టాండ్ వద్ద నడుస్తున్న బస్సు కిందకు భార్యను భర్త తోసివేయడంతో ఆమెకు తీవ్ర గాయాలైనయ్యాయి. దీంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడి చేరుకున్న పోలీసులు గాయాలైన పద్మను చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్‌లో నగరంలోని ఉస్మానియా దవాఖానకు తరలించారు.
మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం కౌకుంట్ల గ్రామానికి చెందిన బందన్న, పద్మ దంపతులు గత కొతకాలం క్రితం బతుకుదేరువు కోసం శంషాబాద్ మున్సిపాలిటీలోని రాళ్లగూడలో నివాసముంటు కూలీపని చేస్తు జీవనం సాగిస్తున్నారు. శనివారం ఆర్ధరాత్రి 11 గంటల సమయంలో భార్యభర్తలు ఇద్దరు స్వగ్రామానికి వెళ్లడం కోసం శంషాబాద్ బస్‌స్టాండ్‌కు వచ్చారు. మద్యం మత్తులో ఉన్న భర్త బందన్న భార్యను నడుస్తున్న బస్సుకిందకు తోసేశాడు. దీంతోబస్సు ముందు టైర్ల కింద పద్మపడడంతో ఆమెకు చేతిపూర్తిగా నుజ్జనుజ్జు అయింది. వెంటనే స్థానికులు భర్తను దోహశుద్ధిచేసి పోలీసులకు అప్పగించారు.
ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆర్జీఐఏ పోలీసులు తెలిపారు. కాగా, అక్కడే ఉన్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చినా రాకపోవడంతో వారు 100కు సమాచారం ఇచ్చారు. కొద్దిసేప్పటికి సంఘటన స్థలానికి చేరుకున్న ఇద్దరు కానిస్టేబుల్స్ ఎవ్వరు 100కు సమాచారం ఇచ్చారమిచ్చారని అడిగితే అక్కడ ఉన్న ఓ వ్యక్తి తాను ఇచ్చానని చెప్పడంతో అతడిపై ఓవరాక్షన్ చేయడంతో పాటు మరోసారి 100కు డయల్ చేస్తే ఊరుకునేదిలేదు. కేసులు పెడుతామని హెచ్చరించారు. దీంతో పాటు బూతుమాటలు తిట్టిన్నట్లు స్థానికులు తెలిపారు.