సిటీబ్యూరో, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ): కొన్ని నెలలుగా సిమ్లా టూ హైదరాబాద్‌కు జరుగుతున్న మాదకద్రవ్యాల నెట్‌వర్క్‌ను మల్కాజిగిరి కమిషనరేట్ పోలీసులు ఛేదించారు. టోలీచౌకీ ప్రాంతానికి చెందిన జునైద్ రాజా సిద్ధిఖీ సేల్స్ మేనేజర్‌గా చేస్తుండడంతో పలువురితో పరిచయాలున్నాయి. బండ్లగూడ సన్సిటీలోకి చెందిన సునీల్ సుబ్బా అలియాస్ జానీ బార్లో పనిచేస్తున్నాడు.
మహ్మద్ అన్సారీ ప్రస్తుతం నిమ్లాలో ఉంటూ హోటల్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. డ్రగ్ విక్రయాలు చేసే వారితో పరిచయాలు ఏర్పడ్డాయి. హైదరాబాద్‌లో ఉంటున్న తన స్నేహితులతో నెట్‌వర్క్‌ను ప్రారంభించాడు. ఇలా గత ఏడాది కాలంగా తానే స్వయంగా వచ్చి డ్రగ్స్ సరఫరా చేసి వెళ్లడం, మరికొన్ని సార్లు రాజు అనే వ్యక్తితో డ్రగ్స్‌ను హైదరాబాద్‌కు పంపిస్తున్నాడు.
ప్రస్తుతం సేల్స్ మేనేజర్‌గా సిద్ధిఖీ పనిచేస్తుండడం, సుబ్బా బార్లో పనిచేస్తుండడంతో కొత్త కొత్త పరిచయాలు ఏర్పడ్డాయి. దీంతో నెలకు కనీసం ఒకటి రెండు సార్లు అన్సారీ డ్రగ్‌ను డెలివరీ చేస్తున్నాడని పోలీసులు గుర్తించారు. కాగా, గోవా నుంచి డ్రగ్ పెడ్లర్లపై ఈగల్ టీమ్ నిఘా పెట్టడంతో ఇప్పుడు ఇతర పర్యాటక ప్రాంతాలను నిందితులు ఎంచుకుంటున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అన్సారీ కోసం గాలిస్తున్నారు.