సిటీబ్యూరో, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్‌కు తాగు నీరు సరఫరాలో 48 గంటల పాటు అంతరాయం కలగనున్నట్లు జలమండలి అధికారులు ప్రకటించారు.
గోదావరి డ్రింకింగ్ వాటర్ సైప్లె ఫేజ్-1 పథకంలో భాగంగా ముర్మూర్, మల్లారం, కొండపాక పంపింగ్ స్టేషన్లో 3000 మిల్లీమీటర్ల డయా ఎంఎస్ పంపింగ్ మెయిన్‌పై అమర్చిన 90 ఎంఎం డయా వాల్వుల మార్పిడి పనులు జరుగుతున్నాయని తెలిపారు. దీంతో ఈనెల 9న ఉదయం 6 గంటల నుంచి 10న ఉదయం 11 గంటల దాకా పనులు జరగనున్నట్లు వెల్లడించారు.