HMWSSB | సిటీబ్యూరో, జనవరి 11 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ మహానగరానికి తాగునీరు సరఫరా చేసే మంజీరా ప్రాజెక్టు ఫేస్- 2 పరిధిలోని కలబ్గూర్ నుంచి హైదర్‌నగర్ వరకు ఉన్న 1500 ఎంఎం డయా పీఎస్సీ పంపింగ్ మెయిన్‌కు పలు చోట్ల భారీ లీకేజీలు ఏర్పడ్డాయి. వీటిని అరికట్టేందుకు అధికారులు మరమ్మతు పనులు చేపట్టనున్నారు.
సోమవారం ఉదయం 6 గంటల నుంచి మంగళవారం ఉదయం 6 గంటల వరకు పనులు జరుగుతాయి. దీంతో ఓ అండ్ ఎం డివిజన్-6 ఎర్రగడ్డ, యూసఫ్‌గూడ, బోరబండ, కేబీపీహెచ్బీకాలనీ, మూసాపేట, నిజాంబపేట, హైదర్‌నగర్, పటాన్చెరు, రామచంద్రాపురం, దీప్తి శ్రీనగర్, మదీనాగూడ, మియాపూర్, హఫీజ్‌పేట్, బీరంగూడ, అమీన్పూర్, బొల్లారం ప్రాంతాల్లో 24 గంటల పాటు తాగునీటి సరఫరా నిలిచిపోతుందని అధికారులు తెలిపారు.