సిటీబ్యూరో, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ): అరుణ వర్ణ కాంతులు ఓ వైపు.. అస్తమిస్తున్న భానుడు మరో వైపు.. అత్యద్భుతమైన ఈ దృశ్యాలను తిలకిస్తూ ట్యాంక్‌బండ్‌పై సందడి చేస్తున్న సందర్శకులు.. వారి చేతిలోని బెలూన్ల పక్కనే దేశానికి దారి చూపిన రాజ్యాంగ నిర్మాత 125 అడుగుల నిలువెత్తు విగ్రహం. హైదరాబాద్ మహానగరానికే మకుటాయమానంగా మారిన అంబేద్కరుడు.. అదిగదిగో చూడు.
హుస్సేన్‌సాగర్ చుట్టూ ఉన్న బుద్ధ పూర్ణిమ ప్రాజెక్ట్ (బీపీపీ) పరిధిలోని అన్ని పారులు, రెస్టారెంట్లు ఈనెల 14న మూసివేస్తున్నట్లు హెచ్ఎండీఏ తెలిపింది. డాక్టర్ బీఆర్ అంబేదర్ జయంతిని పురసరించుకొని బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు పరిధిలో ఏర్పాటు చేసిన అంబేదర్ భారీ విగ్రహాన్ని శుక్రవారం సీఎం కేసీఆర్ ఆవిషరించనున్నారు. ఈ సందర్భంగా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు హెచ్ఎండీఏ ఒక ప్రకటనలో తెలిపింది. హుస్సేన్‌సాగర్ చుట్టూ ఉన్న ఎన్టీఆర్ గార్డెన్, లుంబిని పార్, ఎన్టీఆర్ ఘాట్, పిట్ స్టాప్, జలవిహార్, సంజీవయ్య పార్, అమోఘం రెస్టారెంట్ వంటి సందర్శన స్థలాలను ఈనెల 14న మూసివేయనున్నట్లు హెచ్ఎండీఏ అధికారులు పేర్కొన్నారు.