జూబ్లీహిల్స్,అక్టోబర్16: కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఎన్ని అమలుచేసిందో ప్రజలకు చెప్పిన తర్వాతనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో ప్రజలను ఓట్లు అడగాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పేర్కొన్నారు. గురువారం యూసుఫ్‌గూడ డివిజన్లో మాజీ ఎమ్మెల్యే విష్ణువర్థన్ రెడ్డితో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
సీనియర్ నాయకులు అశీష్ కుమార్ యాదవ్, పుస్తె శ్రీకాంత్, కార్పొరేటర్ రాజ్‌కుమార్ పటేల్‌తో కలిసి కోట్లవిజయభాస్కర్‌రెడ్డి స్టేడియం, పోచమ్మ టెంపుల్ రోడ్డు, లక్ష్మీనర్సింహనగర్, గణపతి కాంప్లెక్స్, యూసుఫ్‌గూడ హరిజన బస్తీ తదితర ప్రాంతాలలో పాదయాత్రచేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు, అభిమానులు ‘జై తెలంగాణ.. జైజై తెలంగాణ.. మాగంటి అమర్ హై.. కేసీఆర్ నాయకత్వం వర్థిల్లాలి.. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపినాథ్‌ను తెలిపిద్దాం..’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ ప్రచార నాయకులు ఆజం అలీ, ఫయీమ్, మంగళారపు లక్ష్మణ్, వాసాల వెంకటేష్, పర్వతం సతీష్, పవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.