బంజారాహిల్స్, నవంబర్ 20: పేదల అవసరాలు, కష్టాలు గుర్తించి సంక్షేమ పథకాలు అందజేస్తున్న బీఆర్ఎస్ పార్టీని ఆదరించాలని, కాంగ్రెస్, బీజేపీలకు ఓటేస్తే నష్టపోతారని ఖైరతాబాద్ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి దానం నాగేందర్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జూబ్లీహిల్స్ డివిజన్ పరిధిలోని జ్ఞానీజైల్ సింగ్‌నగర్, స్వామి వివేకానందనగర్, అంబేద్కర్‌నగర్, దీన్ దయాళ్‌నగర్, బీజేఆర్నగర్, పటేల్‌నగర్ బస్తీల్లో కార్నర్ మీటింగ్స్ నిర్వహించారు.
ఈ సమావేశాల్లో దానం నాగేందర్ పాల్గొని మాట్లాడారు. రాష్ర్టాన్ని దేశంలోనే నంబర్‌వన్‌గా తీర్చిదిద్దిన సీఎం కేసీఆర్‌ను మరోసారి గెలిపించాలని కోరారు. పేదలకు అండగా నిలబడాలనే లక్ష్యంతో జీవో 58 కింద ఉచితంగా ఇండ్ల క్రమబద్ధీకరణ, మంచినీటి సమస్య పరిష్కారం, 24 గంటల కరెంట్, ఉచితంగా మంచినీటి సరఫరా, ప్రతి వీధికి రోడ్లు, డ్రైనేజీల సామర్థ్యాన్ని పెంచడం లాంటి పనులను చేపట్టామని గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ వెల్దండ వెంకటేశ్, మాజీ కార్పొరేటర్ కాజా సూర్యనారాయణ, బీఆర్ఎస్ రాష్ట్ర నేత అర్షద్ నవాబ్, మామిడి నర్సింగరావు, కాటూరి రమేశ్, భవానీ రమేశ్, నర్సింహ ముదిరాజ్, జగన్, ఉపేందర్, పర్వతాలు, శ్రీను, అశోక్, పద్మ, విజయలక్ష్మి, చంద్రమ్మ, రాములమ్మ, ధనమ్మ, మంజుల పాల్గొన్నారు. కాగా బండారు బాల్‌రెడ్డినగర్‌కు చెందిన బీజేవైఎం డివిజన్ అధ్యక్షుడు వంగర చేతన్‌కుమార్ అలియాస్ నానితోపాటు పెద్ద సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు దానం నాగేందర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.