సిటీబ్యూరో, జూన్ 11 (నమస్తే తెలంగాణ): భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా పూర్తి స్థాయిలో వసతులు కల్పించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. బోనాలు, మెహ్రరం పండుగల సందర్భంగా బుధవారం ఆయన డబీర్పుర, లాల్ దర్వాజ ప్రాంతాల్లో పర్యటించి ఏర్పాట్లను పరిశీలించారు.
భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా పూర్తి స్థాయిలో వసతులు కల్పించాలని చెప్పారు. శానిటేషన్పై ప్రత్యేక దృష్టి సారించాలని జోనల్ అధికారులను ఆదేశించారు. విద్యుత్ అంతరాయం లేకుండా సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. భక్తులు కూడా పరిశుభ్రతను పాటించాలని, వ్యర్థాలను నిర్దేశించిన ప్రదేశాల్లోనే పార వేయాలని కమిషనర్ కోరారు.