Doctorate | శామీర్‌పేట్, ఫిబ్రవరి 21 : రసాయన శాస్త్రం అధ్యాపకురాలు అనితకు ఉస్మానియా విశ్వవిద్యాలయం డాక్టరేట్‌ను ప్రకటించడం గర్వకారణమని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల జగద్గిరిగుట్ట( శామీర్‌పేట) ప్రిన్సిపాల్ డాక్టర్ ఇశ్రత్ అన్నారు. డాక్టరేట్ పొందిన అధ్యాపకురాలు అనితను కళాశాలలో శుక్రవారం ఉపాధ్యాయులు అభినందించి ఆత్మీయ సన్మానం చేశారు. అనిత ‘ఇంప్యూరిటీ ప్రొఫైలింగ్ అండ్ స్టెబిలిటీ ఇండికేషన్ మెథడ్ డెవలప్మెంట్ అండ్ వాలిడేషన్ ఆఫ్ సెలెక్టెడ్ డ్రగ్స్ బై ఆర్పి – హెచ్పీఎల్సీ, యూపీఎల్సీ అంశంపైన ఉస్మానియా విశ్వవిద్యాలయం రసాయన శాస్త్రంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న సునీత మంజరి పర్యవేక్షణలో పరిశోధన చేశారు. ఆమెకు డాక్టరేట్ రావడం పట్ల కళాశాల అధ్యాపకులు అభినందనలు తెలియజేసారు.