ఆస్తి తగాదాలతో మా వద్దకు రాకండి..
ఖాళీ స్థలాలు ఉన్నవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, కాంపౌండ్ వాల్, ఇతర ఏర్పాట్లు చేసుకోవాలని రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ సూచించారు. రాత్రివేళల్లో కొందరు జేసీబీలతో కబ్జా చేస్తున్నారనే ఫిర్యాదులొస్తున్నాయని, వీటిపై కఠినంగా ఉంటామని స్పష్టం చేశారు
సివిల్ అంశాల్లో జోక్యం చేసుకోం
రాచకొండ సీపీ మహేశ్ భగవత్
సిటీబ్యూరో, ఏప్రిల్ 12(నమస్తేతెలంగాణ): ఖాళీ స్థలాలు ఉన్నవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, కాంపౌండ్ వాల్, ఇతర ఏర్పాట్లు చేసుకోవాలని రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ సూచించారు. రాత్రివేళల్లో కొందరు జేసీబీలతో కబ్జా చేస్తున్నారనే ఫిర్యాదులొస్తున్నాయని, వీటిపై కఠినంగా ఉంటామని స్పష్టం చేశారు.
మంగళవారం నేరేడ్మెట్ కమిషనర్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. స్థలాలు కొనుగోలు చేస్తున్న వారు కచ్చితంగా 30 ఏండ్ల లీగల్ సెర్చ్ డాక్యుమెంట్లు చూసుకోవాలని, ధరలు పెరుగుతుండడంతో డబుల్ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని, కొనుగోలు చేసే సమయంలో వాటికి సంబంధించిన వివరాలను సబ్రిజిస్ట్రార్, రెవెన్యూశాఖలలో తనిఖీ చేసుకోవాలన్నారు. కొందరు సివిల్ వివాదాన్ని క్రిమినల్ అంశంగా మార్చి ఫిర్యాదులను సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. పోలీసుస్టేషన్లలో ల్యాండ్ పంచాయితీలు చేయమని, పోలీసులు ఎవరైనా అనవసరంగా భూవివాదాల్లో జోక్యం చేసుకుంటే కఠిన చర్యలు ఉంటాయని సీపీ హెచ్చరించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

