సిటీబ్యూరో, ఏప్రిల్ 5 ( నమస్తే తెలంగాణ )/అడ్డగుట్ట: సికింద్రాబాద్ నియోజకవర్గ పరిధిలోని ఆజాద్ చంద్రశేఖర్‌నగర్‌లో నూతనంగా నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను గురువారం ప్రారంభించనున్నారు. 48 మంది లబ్ధిదారులకు డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అందజేయనున్నారు.