సిటీబ్యూరో, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): విద్యుత్ శాఖలో అధికారులు ఎవరైనా పనికి లంచం అడిగితే తమ కార్యాలయానికి ఫిర్యాదు చేయవచ్చని డిస్కం సీఎండీ ముషారఫ్ ఫరూఖీ సూచించారు.
అవినీతి ఫిర్యాదులు స్వీకరించేందుకు సీఎండీ కార్యాలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. విద్యుత్ సంస్థలో సిబ్బంది, అధికారులు ఏదైనా పనికి లంచం అడిగితే 040-2345 4884కు, మొబైల్ నంబర్ 7680901912కు కాల్ చేసి..ఫిర్యాదు చేయవచ్చన్నారు.