రవీంద్రభారతి,మార్చి4: సితార, అన్వేషణ, లేడీస్ టైలర్, ఆలాపణ వంటి అనేకమైన అద్భుతమైన హాస్యభరతిమైన చిత్రాల దర్శకుడు,రచయిత వంశీ దర్శకత్వం వహించిన సినిమాల్లో తాను నటించడం అదృష్ణంగా భావిస్తున్నానని ప్రముఖ సినీనటుడు డా.రాజేంద్రప్రసాద్ అన్నారు. వంశీ ఇంటర్నేషనల్ (ఇండియా) గాయని శారద(అమెరికా) సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం రవీంద్రభారతిలోని మెయిన్హాల్లో వంశీ సినీ జీవిత స్వర్ణోత్సవ వేడుక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీనటుడు రాజేంద్రప్రసాద్, రచయిత వేమూరి సత్యనారాయణ, సినీ ఆటోగ్రాఫర్ ఎం.వి రఘుహరి అనుమొలు, నిర్మాత ఏడిద రాజా , సినీ దర్శకులు రేలంగి నరసింహరావు, వంశీ సంస్థల అధినేత వంశీ రామరాజు విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి వంశీకి మెమోంటో అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ప్రముఖ సినీనటుడు రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ హాస్యదర్శకుడు వంశీ దర్శకత్వ ంవహించిన అనేక సినిమాల్లో తాను నటించడం తన పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నారని పేర్కొన్నారు. అనేక హాస్యభరితమైన,వినూత్నమైన సినిమాలకు దర్శకత్వం వహించిన వంశీ గొప్ప దర్శకుడని రాజేంద్రప్రసాద్ కొనియాడారు.
వంశీ వినూత్నమైన హాస్యభరితమైన మంచి సినిమాలకు దర్శకత్వం వహించిన గొప్ప దర్శకుడు అని కొనియాడారు. వంశీ దర్శకత్వం వహించిన సినిమాల్లో తాను నటించానని, ఎన్నో సినిమాలు విజయాలు సాధించిపెట్టాయని కొనియాడారు. రవీంద్రభారతి వేదికపై తనను సత్కరించుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. సభకు ముందు గాయని శారద బృందంతో ఆలపించిన సినీగీతాలు వీక్షకులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో వంశీ సంస్థల చైర్మన్ డా. వంశీరామరాజు పాల్గొన్నారు.