సిటీబ్యూరో, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో ఏదైనా ఇంటి చిరునామా కనుగొనాలంటే నానా తిప్పలు పడాల్సిందే. ఈ సమస్యను అధిగమించేందుకు జీహెచ్ఎంసీ తెరపైకి కొత్త విధానాన్ని తీసుకురాబోతున్నది. గ్రేటర్‌లోని ఇండ్లకు డిజిటల్ నంబర్లు కేటాయించనున్నది. ప్రతి నంబర్లో ప్రత్యేక క్యూఆర్ కోడ్ ఉంటుంది. దానిని స్కాన్ చేస్తే.. సంబంధిత ఇంటి యజమాని పేరు సహా చిరునామా సులభంగా గుర్తించే వీలుంటుంది.
క్యూఆర్ కోడ్‌తో పాటు గూగుల్ మ్యాప్ ద్వారా ఎకడి నుంచైనా సాన్ చేసి నేరుగా ఆ ఇంటికి చేరుకోవచ్చు. విధి విధానాలు రూపకల్పన చేసిన బల్దియా.. వచ్చే నెలలో ఈ ‘డిజిటల్ డోర్ నంబర్’ విధానాన్ని అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నది.