మౌలిక వసతుల కల్పనలో రాజీపడం : ఎమ్మెల్యే వెంకటేశ్
ఎమ్మెల్యే వెంకటేశ్ | అంబర్‌పేట నియోజకవర్గంలోని ఐదు డివిజన్లోని నెలకొన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తానని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు.

కాచిగూడ,సెప్టెంబర్ 9 : అంబర్‌పేట నియోజకవర్గంలోని ఐదు డివిజన్లోని నెలకొన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తానని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. కాచిగూడ డివిజన్లోని చెప్పల్‌బజార్ హరిమాజీద్ సమీపంలో రూ.8 లక్షల రూపాయలతో కొత్తగా ఏర్పాటు చేసిన మంచినీటి పైప్‌లైన్ పనులను గురువారం కాచిగూడ కార్పొటర్ ఉమాదేవితో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు.
అనంతరం బస్తీలో ఎమ్మెల్యే కాలేరు, కార్పొరేటర్ పర్యటించి స్థానిక ప్రజల నుంచి నీటి, డ్రైనేజీ పలు సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కరించాలని జలమండలి అధికారులను ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే కాలేరు మాట్లాడుతూ.. స్థానిక ప్రజల కనీస అవసరాలైన మౌలిక వసతుల కల్పనలో రాజీపడే ప్రసక్తే లేదని పేర్కొన్నారు.
నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిచేస్తూ కనీస మౌలిక సదుపాయలు కల్పించేందుకు బాధ్యతగా కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. పలు డివిజన్లల్లో ప్రధానంగా వేదిస్తున్న నీటి కాలుష్య సమస్య శాశ్వత పరిష్కారంతో పాటు బస్తీల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
కార్యక్రమంలో మాజీ ఫ్లోర్‌లీడర్ దిడ్డి రాంబాబు, కన్నె రమేశ్‌యాదవ్, సునీల్బిడ్లాన్, బి.కృష్టాగౌడ్, డాక్టర్ శిరీషాయాదవ్, ఓం ప్రకాశ్‌యాదవ్, డీజీఎం సన్యాసిరావు, ఏఈ భావన, ఎర్ర భీష్మ, నాగేందర్బాబ్జీ, బబ్లూ, రవీందర్‌యాదవ్, బండారు సంతోశ్‌కుమార్, తుమ్మల నర్సింహరెడ్డి, పట్లూరి సతీశ్, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

