ఎల్బీనగర్, నవంబర్ 5: మిస్సింగ్ అయిన సెల్ఫోన్లను రికవరీ చేయడంలో తెలంగాణలోనే సరూర్నగర్ పోలీసులు అగ్రస్థానంలో నిలిచారు. పోయిన సెల్ఫోన్లను రికవరీ చేసి బాధితులకు తిరిగి అందజేసిన సరూర్నగర్ ఇన్స్పెక్టర్ సైదిరెడ్డిని తెలంగాణ డీజీపీ జితేందర్ అభినందించి, ప్రశంసా పత్రాన్ని అందజేశారు.
మిస్సింగ్ అయిన సెల్ఫోన్లను రికవరీ చేయడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే రెండవ స్థానంలో నిలిచినట్టు పోలీసులు తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా 2023, ఏప్రిల్ 20 నుంచి 2024, నవంబర్ 3 వరకు 577 రోజుల్లో మొత్తం 50,788 ఫోన్లు రికవరీ చేసినట్టు పోలీసు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఐపీఎస్ అధికారులు శిఖా గోయల్, మహేశ్ భగవత్ తదితరులు పాల్గొన్నారు.