మేడ్చల్జోన్బృందం,జనవరి2:నియోజకవర్గ వ్యాప్తం గా సోమవారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా పలు ఆలయాకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామునుంచే భక్తులు ఆలయానికి వెళ్లి, ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. మేడ్చల్ పట్టణ పరిధిలోని అత్వెల్లి వేంకటేశ్వర స్వామి, మండలంలోని ఘనపూర్ క్షేత్రగిరి వేంకటేశ్వర స్వామి ఆలయానికి, రావల్కోల్ పరిధిలోని జయదర్శిని ఆలయానికి భక్తులు తరలివచ్చారు. మాజీ ఎంపీపీ పద్మాజగన్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ స్వామి వారిని దర్శించుకున్నారు. నాగారం శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయంలో,దమ్మాయిగూడ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆల యం, శ్రీ సీతారామ శివాంజనేయ స్వామి ఆలయాలతో భక్తులు విచ్చేసి, దైవ దర్శనం చేసుకున్నారు.
ఘట్కేసర్ మండల పరిధి వెంకటాపూర్‌లోని శ్రీ బాలాజీ వేంకటేశ్వర స్వామి ఆలయం, ఏదులాబాద్‌లోని శ్రీ గోదా సమే త శ్రీమన్నారు రంగనాయక స్వామి ఆలయాలను జడ్పీ చైర్మన్ శరత్‌చంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి దర్శించుకున్నారు. ఈ మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు వెంకటేశ్ గౌడ్, మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు రమేశ్, శ్రీ బాలాజీ వేంకటేశ్వర స్వామి, ఆలయ కమిటీ చైర్మన్ వేణుగోపాల్, సర్పంచ్‌లు గీత శ్రీనివాస్, సురేశ్, ఎంపీటీసీ రవి, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి పర్వతాపూర్ శ్రీ పరకాల మఠంలో స్వామి వారిని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు.
ఉమ్మడి శామీర్‌పేట మండలం తూంకుంట మున్సిపాలి టీ దేవరయాంజాల్ సీతారామచంద్రస్వామి ఆలయం,అలియాబాద్లోనిరామాలయం,రత్నాలయం, సత్యనారాయణస్వామి ఆలయం, కేశవరంలోని శ్రీబాలాజీ వేంకటేశ్వరస్వామి ఆలయం, ఉద్దెమర్రిలోని అక్కన్నమాదన్న వేంకటేశ్వరస్వామి ఆలయాల్లో భక్తులు స్వామివారిని తెల్లవారుజామును నుంచి ఉత్తరద్వార దర్శనం చేసుకున్నారు. కీసరం మండలం చీర్యాల్ శ్రీ లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి, స్వామి దర్శనం చేసుకున్నారు.
రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ నవీన్‌మిట్టల్ దంపతులు చీర్యాల్ శ్రీ లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకొని, స్వర్ణ పుష్పాల పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నవీన్‌మిట్టల్ దంపతులను ఆలయ చైర్మన్ మల్లారపు లక్ష్మీనారాయణగౌడ్, ఎంపీపీ మల్లారపు ఇందిర, ఆలయ ధర్మకర్త శ్రీహరిగౌడ్ శాలువాతో ఘనంగా సత్కరించారు. ఘట్కేసర్లోని శ్రీబాలాజీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో,పోచారం మున్సిపాలిటీ సంస్కృతి టౌన్షిప్, యంనంపేట్‌లోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. కార్యక్రమంలో చైర్పర్సన్లు పావని జంగయ్యయ యాదవ్, బి.కొండల్‌రెడ్డి, అధ్యక్షుడు హరిప్రసాద్‌రావు, ఎండోమెంట్ ఈఓ భాగ్య లక్ష్మి, ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ ప్రణిత్‌కుమార్,మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, జడ్పీచైర్మన్ శరత్ చంద్రారెడ్డి, యంనంపేట్ ఆలయ కమిటీ చైర్మన్ రాజేశ్ గౌడ్ పాల్గొన్నారు.